Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఆ పూట సెక్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అంట అమ్మాయిలకు-Women Prefer This Time The Most For Sex – Study

Telugu Health Tips

సెక్స్ కి సమయం సందర్భం అక్కరలేదు అని అంటారు. నిజమే మరి, ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే పని కానియ్యాలి. కామోద్రేకం ఎప్పుడు కలిగితే అప్పుడే కోరిక తీర్చుకోవాలి భాగస్వాములు. కాని అన్నిపనులకి ఓ మంచి సమయం ఉన్నట్లే, సెక్స్ కి కూడా ఓ మంచి సమయం ఉంటుందట. ఆ సమయంలో సెక్స్ కొంచెం ఎక్కువ కిక్ నే ఇస్తుందట. మరి ఆ అప్పుడు, ఎప్పుడో చూడండి.

జర్నల్ ఆఫ్ సెక్సాలాజీ సంస్థ వారు, క్వీన్స్ లాండ్ లో ఈ మధ్యే ఓ సర్వే చేసారు. 450 అమ్మాయిలను పిలిపించారు. వాళ్ళందరిని రెండు ప్రశ్నలు అడిగారు. ఒకటి, మీరు సెక్స్ ఎప్పుడు చేయడానికి ఇష్టపడతారు అని, రెండు సెక్స్ ఎక్కువగా ఏ సమయంలో చేస్తున్నారు అని. మొదటి ప్రశ్నకి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. 53% మంది స్త్రీలు ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయ్యి సెక్స్ చేయడాన్ని ఇష్టపడతారట. 44% మంది రాత్రిపూటకి ఓటు వేసారు. మిగితా ఓట్లు మిగితా సమయాలకి పడ్డాయి.

ఇక రెండొవ ప్రశ్న .. ఎక్కువగా సెక్స్ చేసే సమయం ఏది అని. ఈ ప్రశ్నకి మాత్రం మనం ఊహించే సమాధానమే ఎదురయ్యింది. 87% మంది రాత్రిపూటే శృంగారిస్తున్నారట. మిగితావారు మిగితా సమయాల్లో సెక్స్ ఎక్కువగా చేస్తున్నారట. ఈ ఫలితాలు మనల్ని ఆశ్చర్యపరచవచ్చు కాని, పరిశోధకులని ఆశ్చర్యపరచలేదు. దానికి కారణం, వారికి ఉదయంపూట సెక్స్ ఎందుకు మేలో, ఆ పూట సెక్స్ ని అమ్మాయిలు ఎందుకు కోరుకుంటున్నారో తెలీడమే.

ఉదయంపూట మగవారిలో టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవల్స్ ఎక్కువ ఉంటాయి. దాంతో అంగస్తంభన సమస్యలు పెద్దగా ఉండవు. అదే రాత్రపూట ఇలాంటి సమస్యలు ఎదురుకావచ్చు. అలాగే ఉదయం పూట మహిళల శరీరం కూడా శృంగారానికి మరింత సహకరిస్తుంది. అదే రాత్రి అయితే రోజంతా అలసిపోయిన శరీరంతో వంద శాతం పెర్ఫార్మెన్స్ కష్టం అయిపోతుంది. విశ్రాంతి తరువాత చేసే సెక్స్ చాలా బలంగా ఉంటుందట. అందుకే, ఈ సమయంలో సెక్స్ ఎక్కువ కావాలని క్వీన్స్ లాండ్ అమ్మాయిలు కోరుకుంటున్నా, గజిబిజి జీవితంలో, శృంగారం అనేది కేవలం రాత్రిపూట ఆడే ఆట అయిపోయింది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,చిట్కాలు,వీడియోలు, అరుదైన ఫోటోలు క్రింద చూసి చదవండి

More in Featured

  • Health

    5 types of Pomegranate juice which will solve your summed problems

    By

    38-42 డిగ్రీలు.. ఇది సగటున రోజూ హైదరాబాద్ లో ఉంటున్న టెంపరేచర్. వేసవిలో పల్లెటూరిలో ఉంటేనే మేలండి, చెట్ల కింద కూర్చుంటే...

  • News

    15 tips to grow beard faster

    By

    Having a beard is new cool these days. From film stars to cricketers, almost everyone has...

  • Health

    How to clean your ears in a healthy way

    By

    చెవులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయండి. చాలా అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. చెవిలో గులిమి ఉంటే చూడ్డానికి బాగా...

  • Health

    Signs in a body that speak about liver damage

    By

    మన శరీరంలోని అతిముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. మనం తినే ఆహారం జీర్ణం కావడానికి లివర్ కావాల్సిందే. డైజెస్టీవ్ ట్రాక్...

To Top
Loading..