Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

భర్త వలన పోర్న్ బ్యాన్ చేయమంటూ కోర్టుకెక్కిన భారతీయ మహిళ-Women Married For 32 Years Moves Supreme Court For Porn Ban

అవిడొక కెమికల్ ఇంజనీర్. 32 రెండేళ్ళ క్రితం పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. సింపుల్ గా, హ్యాపిగా సాగిన ఆవిడ జీవితం కొన్నాళ్ళుగా నరకంగా మారింది. దానికి కారణం పోర్న్. అవును, పోర్న్ కి బానిసైన భర్త వలన ఆవిడ నరకం చూస్తోందట.

కొన్నేళ్ళుగా పోర్న్ కి బానిసైపోయిన ఆవిడ భర్త అదేపనిగా పోర్న్ చూస్తూ గడిపేయడమే కాకుండా, పోర్న్ లో ఉండే విపరీత అంశాలు తమ సంసారంలోకి కూడా కావలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడట. ఆ వేధింపులు, ఆ వింత ప్రవర్తన భరించలేక ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. పోర్న్ ని బ్యాన్ చేయాలంటూ కోరుకుంటోంది.

” నా భర్త పోర్న్ చిత్రాలకు పూర్తిగా బానిసైపోయాడు. రోజంతా అవే చూస్తూ గడిపేస్తాడు. ఇంటర్నెట్ లో పోర్న్ చాలా సులువుగా దొరకడంతో బాగా అలవాటు పడిపోయాడు. అది ఆయన్ని కామాంధుడిగా నా వివాహ జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. కొన్ని వీడియోలు హింసాత్మకంగా ఉంటాయి. అవి ఇంత వయసొచ్చిన నా భర్తనే కలుషితం చేస్తే, యువతపై ఎంత చెడు ప్రభావం చూపాలి? నేనే కాదు, మానసికంగా నా పిల్లలు కూడా నా భర్త ప్రవర్తన పట్ల బాధపడుతున్నారు. ఓ వయసుకొచ్చిన తండ్రీ టీనేజర్ కన్నా దారుణంగా ప్రవర్తించడం వారిని బాధిస్తోంది. నేను కోర్టుని ఒక్కటే కోరుకుంటున్నాను. పోర్న్ మొత్తాన్ని, లేదంటే ఆడవాళ్ళని తక్కువగా చూపించే వీడియోలపై అయిన చర్యలు తీసుకోవాలి. లేదంటే యువత పోర్న్ వలలో చిక్కుకుంటుంది.” అంటూ కోర్టుని కోరుకుంది ఆ మహిళ.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts
To Top