అమ్మాయి స్కర్ట్ వేసుకుందని అరెస్టు చేసారు

వెస్ట్రన్ కంట్రీస్, భారత్ లో ఉండే స్వేఛ్చ అన్ని దేశాల్లో ఉండదుగా.ముఖ్యంగా అరబ్ దేశాల్లో కొన్ని చట్టాలు ఎలా ఉంటాయో ! సౌదీ అరేబియా మహిళల పట్ల చాలా స్ట్రిక్ట్ రూల్స్ కలిగి ఉంటుంది.

 Women Gets Arrested For Wearing Skirt In Saudi Arabia-TeluguStop.com

మహిళలు కొన్నిరకాల ఉద్యోగాలు చేయరాదు, టైట్ బట్టలు వేసుకోరాదు, హిజాబ్ ధరించాలి .ఇలా రకరకాల రూల్స్ ఉంటాయి.ఈమధ్యే అమ్మాయిలు స్కూల్స్ లో ఆటలు నేర్చుకునేందుకు, శృంగారం మీద పాఠాలు నేర్చుకునేందుకు అనుమతించారు.చాలా పెద్ద మార్పు వస్తోందని సౌది మహిళలు ఇలా ఆనందపడ్డారో లేదో, అంతలోనే మరో ప్రభుత్వం, పోలీసు డిపార్ట్మెంట్.

స్కర్ట్ వేసుకున్నందుకు ఓ మహిళను అరెస్టు చేసారు.మీరు విన్నది నిజమే.మినీ స్కర్ట్ ధరించినందుకు ఓ మహిళను వెతికి వెతికి మరీ అరెస్టు చేసారు.

వివరాల్లోకి వెళితే ఖులూద్ అనే అమ్మాయి ఓ సౌదిలోని ఓ చారిత్రాత్మక కోట దగ్గర స్కర్ట్ ధరించి తన విడియో తీయించుకుంది.

స్టైల్ గా నడుస్తూ, ఇసుకను చేతిలో పట్టుకొని విడియోకి ఫోజులిచ్చింది.సౌదిలో ఉంటూ అదేమీ మొండి ధైర్యమో … స్నాప్ చాట్ లో పోస్టు చేసింది ఆ విడియో.

మెల్లిగా ఆ విడియో వైరల్ వెళ్ళింది.సౌది కి చెందిన నేటిజన్స్ కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.

విడియో అధికారుల దాకా వెళ్ళింది.దాంతో ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో కనుక్కొని మరో అరెస్టు చేసారు.

అసలే మతపిచ్చి ఎక్కువ.అందులోని ఈ అమ్మాయి అలా స్కర్ట్ వేసుకొని సొగసుగా నడుస్తూ వెళ్ళింది నజ్ద్ అనే ప్రాంతంలో.

అది ఓ మతపెద్ద పుట్టిన ప్రదేశం అంటా.అలాంటి పవిత్రమైన ప్రదేశంలో పాడు సంస్కృతి పాటిస్తూ, చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరగడానికి ఆ అమ్మాయికి ఎంత ధైర్యం అంటూ దేశ ప్రజలే తిడుతున్నారంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోండి.

Women gets arrested for wearing skirt in Saudi Arabia -  Women Gets Arrested For

ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓ పెద్ద సంచలనం.స్త్రీ పురుష భేదాలు సౌదిలో పెరిగిపోతున్నాయని వాదిస్తున్నారు హ్యూమన్ రైట్స్ వారు.సౌది ప్రిన్స్ పాప్ సింగర్ రిహానాతో డేటింగ్ చేస్తున్నాడు.అతడు అర్థ నగ్నంగా ప్రేయసితో సరసాలు ఆడుతూ ఫోటోలు పెట్టిన ఎవరు ఏమి అనలేదు, సౌదిలో ఉండగా, సౌది రూల్స్ కి వ్యతిరేకంగా ట్రంప్ కూతురు ఇవాంక టైట్ మరియు చిన్న బట్టలు వేసుకున్నా, ఎవరు రియాక్ట్ అవలేదు.

కాని చేతిలో పవర్ లేదు కాబట్టి ఓ మామూలు అమ్మాయి స్కర్ట్ వేసుకున్నందుకు అరెస్టు చేసారు అంటూ తమ వాదన వినిపిస్తున్నారు.

పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, దేశ ప్రజలు ఎవరు ఆమెకి సపోర్ట్ చేయలేదు.

సోషల్ మీడియాలో కూడా ఆమె స్కర్ట్ వేసుకున్న విడియోని ఉన్నది ఉన్నట్టుగా అలానే పోస్ట్ చేస్తే ఎక్కడ అరెస్టు చేస్తారో అని, జనాలు ఆమె కాళ్ళను బ్లర్ చేసి మరీ విడియోని షేర్ చేస్తున్నారు.ఎంత దారుణమో చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube