Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

భర్తతో అక్రమ సంబంధం .. అమ్మాయి యోనిలో మిరపకాయ పెట్టిన భార్య -Woman Puts Chilli In A Girl’s Vagina With Illegal Affair With Her Husband

హెడింగ్ చూస్తే చాలా హింసాత్మకంగా ఉంది కదూ. మరి ఓ భార్య అలాంటి పని చేసింది. అది కూడా మరో స్త్రీ మీద. ఊహించడానికి కూడా భయపడే ఈ సంఘటన వియత్నాంలో జరిగింది. దీని కథాకమీషు ఏంటో చూడండి ఓసారి.

వివరాల్లోకి వెళితే లీ చానెల్ అనే 23 ఏళ్ల అమ్మాయి, 24 ఏళ్ల చిన్ కియోని గత ఏడాది పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు చానెల్ మూడు నెలల గర్భవతి. తాను ఓ కొడుకుకి మరో ఆరునెలలలో జన్మనివ్వబోతున్నన్న సంతోషంలో ఉండగా, ఆమెకి ఓ నమ్మలేని నిజం తెలిసింది. అదేంటంటే తన భర్త ఓ పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన భర్త చాలాసేపు బయట గడపుతుండటంతో చానెల్ కి అనుమానం వచ్చిందట. దాంతో గుడాచారి లాగా భర్తను ఫాలో అయ్యి, తనతో పాటు తిరిగుతున్న అమ్మాయి ఎవరో తెలుసుకుంది. అంతే, పట్టరాని కోపంలో ఒక భయంకరమైన ప్లాన్ వేసింది.

భగభగలాడే మిరపకాయల సంచి తీసుకుంది. తనతో పాటు తన నలుగురు స్నేహితులని తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని తన స్నేహితులు గట్టిగా పట్టుకోగా, అమ్మాయిని వివస్త్రను చేసి, ఆ మిరపకాయలను ఆమె ప్రైవేట్ పార్ట్ లో పెట్టేసింది. తప్పించుకొండా అందరు గట్టిగా ఆగబట్టారు. ఆ మంటకి ఆ అమ్మాయి తల్లడిల్లుతుంటే విడియో తీసింది. అక్కడితో ఆగకుండా, నా భర్తను వలలో వేసుకున్నందుకు నేను ఓ అమ్మాయికి విధించిన శిక్ష ఇది అంటూ సోషల్ మీడియాలో ఆ విడియోని పోస్టు చేసింది. కాని ఆ పోస్టు మీద అన్ని నెగెటివ్ కామెంట్స్ అంట. ఊరికే అమ్మాయి మీద పడటం కాదు, తప్పు కేవలం అమ్మాయే చేసిందా ? మరి నీ భర్తకి ఎలాంటి శిక్ష విధిస్తావు అంటూ అంతా నిలదీసారట. దాంతో పోస్టు డిలీట్ చేసింది. కాని వైరల్ వెళ్ళిన ఆ విడియో గురించి పోలీసులకి తెలిసింది. విచిత్రమైన విషయం ఏమిటంటే, తనపై ఇలా దాడి చేసినా, ఆ అమ్మాయి కాని, ఆ అమ్మాయి తరఫున కాని ఎవరు కేసు బుక్ చేయలేదట.

ప్రస్తుతం ఆ అమ్మాయి హాస్పిటల్ లో ఉంది. ఆ మిరపకాయల వలన ఆమె శరీరానికి ఎలాంటి నష్టం జరిగినా, సెక్షన్ 104 కింద చానెల్ పై కేసు బుక్ చేసి, £70 నుంచి £100 వరకు జరిమానా విధిస్తారట పోలీసులు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఒకమ్మాయి శారీరకంగా హింసను అనుభవించి హాస్పిటల్ లో ఉంది, మరో అమ్మాయిపై కేసు బుక్ అవుతోంది, ఆ భర్తకి మాత్రం ఎవరు ఎలాంటి శిక్ష విధించలేదు.

Continue Reading
More Posts
To Top