వీర్యం కోసం పోలీసులకి ఫోన్ చేసిన అమ్మాయి .. అసలేం జరిగిందంటే!

ఆ అమ్మాయి వయసు 26 సంవత్సరాలు.ఉండేది ఫ్లోరిడాలో.

 Woman Called Police To Save Her From Sperm Filled Thermosflask Which Could Blow-TeluguStop.com

పేరు ఫేలిసియా నెవీన్ అంట.తనకి తల్లి కావాలనిపించింది.గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనివ్వాలనిపించింది.కాని తనకి బాయ్ ఫ్రెండ్ లేడు.పెళ్ళి కూడా కాలేదు.ఎవరికైనా మాములుగా పెళ్ళి చేసుకున్న తరువాత పిల్లల్ని కావాలనిపిస్తుంది.

కాని ఈ అమ్మాయి కొంచెం రివర్స్.అప్పటికప్పుడే గర్భం దాల్చలనుకుంది.

అది కూడా ఎవరితోనో సెక్స్ చేసి కాదు.వీర్యం సంపాదించి.

మీకు తెలిసిన విషయమే, కొంతమంది మగవారు తమ వీర్యాన్ని దానం చేస్తుంటారు.వీరినే స్పెర్మ్ డోనర్స్ అని అంటారు.

ఇంగ్లాండ్ లో అయితే మనం ఆహారం బుక్ చేసుకున్నట్లుగా వీర్యాన్ని బుక్ చేసుకోవచ్చు.

ఫ్లోరిడాలో ఇంకా అలాంటి వసతులు రాలేదు.

అందుకే ఓ హాస్పిటల్ కి వెళ్లింది ఆ అమ్మాయి.వెళ్ళి డాక్టర్లకి తన పరిస్థితిని వివరించింది.

నాకు వీర్యం కావాలని, సెక్స్ తో సంబంధం లేకుండా బిడ్డకు జన్మనివ్వడం తన కోరిక అని రిక్వెస్ట్ చేసింది.ఆ అమ్మాయి వీర్యాన్ని ఏం చేసుకుంటే వారికేంటి .డబ్బులు చెల్లించింది కాబట్టి వీర్యాన్ని ఇచ్చారు.ఇక్కడ వారు చేసిన పొరపాటు ఏమిటంటే మామూలుగా ట్యూబ్ లో ఇవ్వకుండా, థెర్మో ఫ్లాస్క్ లో ఇచ్చారు.

ఆ తరువాత అమ్మాయి చేసిన పొరపాటు ఏమిటంటే, ఆ స్పెషల్ ఫ్లాస్క్ కి ఉండే O-రింగ్ తీయకుండా మూత పెట్టేసింది.ఇక్కడ సమస్య ఏమిటంటే, అలా చేస్తే ఫ్లాస్క్ పేలినా పేలొచ్చు.

అలాగే ఇంటికి తీసుకెళ్ళి, తీసుకొచ్చిన పని పూర్తి చేద్దాం అనుకునేసరికి అమ్మాయికి అసలు విషయం గుర్తుకువచ్చింది.ఆ ఫ్లాస్క్ ఎక్కడ పేలుతుందో అనే భయం పట్టుకుంది.దాంతో ఏం చేయాలో అర్థంకాక పోలీసులకి ఫోన్ చేసింది.వారు ఫైర్ డిపార్టుమెంటుతో సహా దిగారు.

ఆ ఫ్లాస్క్ తీసుకోని, వారి పనితనంతో పేలే ప్రమాదాన్ని ఆపి, వీర్యాన్ని ఆమెకు సురక్షితంగా ఇచ్చేసారు.అదండీ సంగతి .వీర్యం కోసం ఇంత హంగామా జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube