1-నేనొక్కడినే చిత్రం దర్శకుడిగా సుకుమార్ ఊహాశక్తిని, నటుడిగా మహేష్ గొప్పతన్నాన్ని చాటిచెప్పింది.కాని పంపిణిదారులకి, నిర్మాతలకి పీడకలగా నిలిచింది ఆ సినిమా.
ఆ సినిమా ఎందుకు ఆడలేదు అనే ప్రశ్న మహేష్ కి చాలాసార్లు ఎదురైంది.ప్రతిసారి మహేష్ ఒక్కటే చెప్పాడు.
ఎడిటింగ్ కి సమయం తీసుకోలేదు, రన్ టైమ్ అవసరానికి మించి ఉండటంతో సినిమాను బోరింగ్ ఫీల్ అయ్యారు ఆడియెన్స్ అని చెప్పుకొచ్చాడు మహేష్.
ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పాలి.
మొదట 1- నేనొక్కడినే రన్ టైమ్ 2 గంటల 20 నిమిషాలు.ఆ రన్ టైమ్ తోనే సినిమా విడుదల చేయాలనుకున్నారు.
కాని సుకుమార్ చాలా సీన్లపై మమకారాన్ని చంపుకోలేక, దాన్ని ఏకంగా 30 నిమిషాలు పెంచేసాడు.థ్రిల్లర్ సినిమాలు ఎంత తక్కువలో ఎంత ఎక్కువ చెబితే అంత మంచిది.
రన్ టైమే 1-నేనొక్కడినే కొంప ముంచింది.
ఇప్పుడు నాన్నకు ప్రేమతో విషయంలో అదే జరుగుతుందేమో అనే టెన్షన్లో ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు.
ప్రస్తుతం నాన్నకు ప్రేమతో ఎడిటింగ్ చివరి దశల్లో ఉంది.సెన్సార్ అయ్యేవరకు రన్ టైమ్ ఎంత అనేది చెప్పలేం.
సుకుమార్ చేసిన తప్పే మళ్లీ చేయకపోతే చాలు.