‘పులి’కి ఓపెనింగ్స్‌ దక్కేనా?

తమిళ స్టార్‌ హీరో విజయ్‌.కోలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను ఈయన అందుకుంటున్నా కూడా టాలీవుడ్‌లో మాత్రం ఇప్పటి వరకు ఈయన ఒక మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకోలేక పోయాడు.

 Will Puli Movie Get Good Collectios In Telu…-TeluguStop.com

ఈయన తోటి హీరోలు సూర్య, విక్రమ్‌, కార్తీ, విశాల్‌ వంటి వారు తెలుగులో మంచి వసూళ్లను రాబడుతున్నారు.కాని విజయ్‌ మాత్రం ఏమాత్రం కలెక్షన్స్‌ను దక్కించుకోలేక పోయాడు.

తమిళంలో ఈయన నటించి బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రాలు తెలుగులో కనీసం ప్రింట్‌ ఖర్చులను కూడా రాలేదని నిర్మాతలు అంటున్నారు.

తాజాగా ఈయన ‘పులి’ చిత్రంతో తమిళనాట భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.

అక్టోబర్‌ 1న విడుదల కాబోతున్న ఈ సినిమా 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.తమిళ బాహుబలిగా ప్రచారం జరుగుతున్న ఈ సినిమాను తెలుగులో సైతం భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విజయ్‌కు ఇక్కడ ఏమాత్రం క్రేజ్‌ లేక పోయినా కూడా శ్రీదేవి, శృతిహాసన్‌, హన్సిక, సుదీప్‌ వంటి తెలుగు ప్రేక్షకుకు సుపరిచితమైన స్టార్స్‌ ఉన్నారన్న నమ్మకంతో తెలుగులో ఈ సినిమాను భారీ మొత్తంకు కొనుగోలు చేశారు.మరి ఈ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందేమో చూడాలి.

ఈ సినిమాతో అయినా విజయ్‌ ఓపెనింగ్స్‌ను రాబట్టగలడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube