ఏపీ హోం మంత్రికి ప్ర‌మోష‌నా...డిమోష‌నా..!

ఉగాది రోజున కాని.ఉగాది త‌ర్వాత కాని ఏపీ సీఎం త‌న కేబినెట్‌ను భారీ స్థాయిలో ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

 Will Ap Home Minister Get Promotion..?-TeluguStop.com

ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఏపీ హోం మంత్రి, డిప్యూటీ సీఎం నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ప్లేస్‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి.ప్ర‌స్తుతం ఏపీలో కాపు ఓటు బ్యాంకు కీల‌కం కానుంది.

కాపు ఉద్య‌మ ప్ర‌భావంతో కాపుల‌ను అన్ని విధాలా సంతృప్తి ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంది.ఈ నేప‌థ్యంలో కాపుల్లో దూకుడుగా ఉండే నేత‌లు టీడీపీకి, చంద్ర‌బాబుకు అత్య‌వ‌స‌రం కానున్నారు.

ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాంధ్ర‌లో కాపు వ‌ర్గానికి చెందిన ప్ర‌స్తుతం ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ హోం మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట‌రావును బాబు త‌న కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.క‌ళా వెంక‌ట్రావు ఇటీవ‌ల పార్టీలో చాలా స్పీడ్‌గా క‌దులుతూ, అంద‌రిని స‌మ‌న్వయం చేసుకుంటూ ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా మంచి ప్ర‌తిభ క‌న‌ప‌రుస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న బ‌య‌ట ఉండడం కంటే కేబినెట్‌లో ఉంటేనే మంచిద‌న్న నిర్ణ‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చార‌ట‌.క‌ళా వెంక‌టరావుకు చంద్ర‌బాబు హోం మంత్రి ఇస్తార‌ని.

ఇదే టైంలో ప్ర‌స్తుతం హోం మంత్రిగా ఉన్న చిన‌రాజ‌ప్ప‌కు ఏపీ టీడీపీ ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది.చిన‌రాజ‌ప్ప కూడా వివాద ర‌హితుడే.

అయితే క‌ళా వెంక‌ట‌రావు ఉన్నంత స్పీడ్‌గా చిన‌రాజ‌ప్ప ఉండ‌ర‌న్న టాక్ కూడా ఉంది.ఈ క్ర‌మంలోనే ఎవ్వ‌రికి ఇబ్బంది లేకుండా క‌ళాను కేబినెట్‌లోకి తీసుకుని.

హోం మంత్రిని చేసి, చిన‌రాజ‌ప్పకు ఏపీ టీడీపీ ప‌గ్గాల‌ప్పగిస్తే బాగుంటుంద‌ని చంద్ర‌బాబు ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

చిన‌రాజ‌ప్ప‌కు పూర్తిగా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించి పూర్తిగా కేబినెట్ నుంచి త‌ప్పిస్తారా ? లేదా ఏదో ఒక మంత్రి ప‌ద‌వితో ఉంచుతారా ? అన్న‌ది కూడా క్లారిటీ లేదు.ఏదేమైనా ఆయ‌న‌కు ప్ర‌మోష‌నా.? డిమోష‌నా ? అన్న‌ది బాబు చేతుల్లోనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube