పవన్ కళ్యాణ్ పుల్లలు పెట్టేది నిజమే అన్నమాట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద వచ్చే అతిపెద్ద గాసిప్పుల్లో ఒకటి, ఆయన కథలో, చిత్రీకరణలో పుల్లలు పెడతారట, దర్శకుడుకి స్వేచ్ఛనివ్వకుండా తన మాటే నెగ్గేలా చేస్తారట.అసలు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి పేరుకే బాబి దర్శకుడు, పెత్తనం మాత్రం పవన్ దే, సినిమాని డైరెక్ట్ చేసింది కూడా హీరోనే, అందుకే సర్దార్ అంత పెద్ద ఫ్లాప్ అయినా, బాబి తప్పు లేకపోవడంతో ఎన్టీఆర్ కొత్త సినిమా అవకాశం ఇచ్చినట్లు చెబుతారు ఇండస్ట్రీ జనాలు.

 Wikipedia Insults Pawan Kalyan-TeluguStop.com

ఇక కాటమరాయుడు చిత్రానికి కూడా అదే జరిగినట్లు టాక్ నడుస్తోంది.ఈ సినిమాకి కూడా డాలి పేరుకే దర్శకుడు అని, నిజానికి సినిమా మొత్తాన్ని నడిపించింది పవన్ కళ్యాణే అని మళ్ళీ టాక్ నడుస్తోంది.

ఈ వార్తకి బలాన్ని చేకూరుస్తూ, కాటమరాయుడు చిత్రం యొక్క వికిపీడియా పేజిలో అఫిషియల్ దర్శకుడిగా కిషోర్ పార్థసాని (డాలి) పేరు, అనధికార దర్శకుడిగా పవన్ పేరు కనిపించాయి.ఇది నిజంగా నిజం, పవన్ ని అవమానించటం కోసం మహేష్, ఎన్టీఆర్ అభిమానులు సృష్టించిన ఫేక్ న్యూస్ కాదు.

ఇది గమనించిన పవన్ కళ్యాణ్ అభిమానులు వికిపీడియా మీద ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేస్తూ ఊగిపోయారు.వికిపీడియా అధికారులకి ఎర్రర్ మీద కంప్లయింట్ పెట్టడంతో, అందులోంచి పవన్ కళ్యాణ్ పేరుని తొలగించారు.

ఈరకంగా, పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో దర్శకులకి స్వేచ్ఛనివ్వకుండా పుల్లలు పెడతారని వికిపీడియా ఒప్పుకున్నట్లయింది.

ఇందులో నిజానిజాలు మనకు తెలియవు కాని, పవన్ మీద ఈ పుల్లలు పెట్టడం అనే టాక్ ఇప్పటినుంచి కాదు, జానీ సినిమా తరువాత నుంచి ఉంది.

పవన్ కి అన్నేళ్ళు ఫ్లాపులు రావడానికి కారణం ఇదే గుణం అని అంటారు.చివరికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా పవన్ నుంచి ఈ చేదు అనుభవం ఎదురైందట.

తీన్ మార్ చిత్రానికి మాట రచయిత త్రివిక్రమ్ కాగా, చాలా సీన్లకి పవన్ సొంతంగా మాటలు రాసుకున్నారట.అందుకే అంటారు .పవన్ కళ్యాణ్ కి కొంచెం తిక్క ఉందని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube