Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

పవన్ కళ్యాణ్ పుల్లలు పెట్టేది నిజమే అన్నమాట-Wikipedia Insults Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద వచ్చే అతిపెద్ద గాసిప్పుల్లో ఒకటి, ఆయన కథలో, చిత్రీకరణలో పుల్లలు పెడతారట, దర్శకుడుకి స్వేచ్ఛనివ్వకుండా తన మాటే నెగ్గేలా చేస్తారట. అసలు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి పేరుకే బాబి దర్శకుడు, పెత్తనం మాత్రం పవన్ దే, సినిమాని డైరెక్ట్ చేసింది కూడా హీరోనే, అందుకే సర్దార్ అంత పెద్ద ఫ్లాప్ అయినా, బాబి తప్పు లేకపోవడంతో ఎన్టీఆర్ కొత్త సినిమా అవకాశం ఇచ్చినట్లు చెబుతారు ఇండస్ట్రీ జనాలు.

ఇక కాటమరాయుడు చిత్రానికి కూడా అదే జరిగినట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి కూడా డాలి పేరుకే దర్శకుడు అని, నిజానికి సినిమా మొత్తాన్ని నడిపించింది పవన్ కళ్యాణే అని మళ్ళీ టాక్ నడుస్తోంది. ఈ వార్తకి బలాన్ని చేకూరుస్తూ, కాటమరాయుడు చిత్రం యొక్క వికిపీడియా పేజిలో అఫిషియల్ దర్శకుడిగా కిషోర్ పార్థసాని (డాలి) పేరు, అనధికార దర్శకుడిగా పవన్ పేరు కనిపించాయి. ఇది నిజంగా నిజం, పవన్ ని అవమానించటం కోసం మహేష్, ఎన్టీఆర్ అభిమానులు సృష్టించిన ఫేక్ న్యూస్ కాదు.

Continue Reading
To Top