బట్టలు ఉతికిన నీటిని కాళ్ళ మీద పోసుకోకూడదు అని అంటారు....ఎందుకు ?

సాధారణంగా చాలా మంది స్త్రీలు బట్టలు ఉడికాక ఆ నీటిని కాళ్ల మీద పోసుకుంటూ ఉంటారు.ఇది చాలా చెడ్డ అలవాటు.

 Why We Shouldnt Pour Laundry Water On Feet-TeluguStop.com

దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు రావటమే కాకుండా ఆర్ధిక సమస్యలు కూడా వస్తాయి.

మనం బయట అనేక చోట్ల తిరుగుతూ ఉంటాం.

ఆలా తిరిగినప్పుడు బట్టల కొనలకు మంచి చెడు రెండు అంటుతాయి.అంటే మనం బయటకు వెళ్ళినపుడు మురికి మరియు చెడు రెండింటిని మోసుకువస్తాము.

అందుకే బయటకు వెళ్లి వచ్చినప్పుడు శుభ్రంగా స్నానం చేసి బట్టలు మారుస్తాం.అలాంటప్పుడు మురికి బట్టలను ఉతికినప్పుడు వచ్చే మురికి నీటిని కాళ్ళ మీద పోసుకుంటే శుభ్రత ఉండదు.

శుభ్రత లేని చోటకు శని వెంటనే ప్రవేశిస్తాడు.అందువల్ల బట్టలను ఉతికిన నీటిని కాళ్ళ మీద ఎట్టి పరిస్థితిలోను పోసుకోకూడదు.

బట్టలు ఉతికిన నీటిని కాళ్లపై పోసుకోవడం వల్ల కాలి గోళ్ళలోకి, కాలిపగుళ్ళ లోకీ ఆ మురికి నీరు చేరి రకరకాల ఇన్ఫెక్షన్లను కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube