టీ - కాఫీకి ముందు మంచినీళ్ళు తాగాలా? తాగకపోతే ఏంటి నష్టం?

మంచినీళ్ళ తరువాత ప్రపంచంలో ఎక్కువమంది సేవిస్తున్న డ్రింక్ ఏమిటి అంటే అది టీ.ఇక్కడ టీ అంటే కేవలం చాయ్ పత్తి వేసుకోని తాగే చాయ్ మాత్రమే కాదు.

 Why Should We Take Water Before Tea Or Coffee?-TeluguStop.com

అది మిల్క్ టీతోపాటు బాదాం టీ అవొచ్చు, అల్లంటీ, గ్రీన్ టీ, చామోలిన్ టీ, మిక్స్డ్ హెర్బల్ టీ .ఇలా రకరకాల టీ అవొచ్చు.ఇలా అన్నిరకాల టీ కలిపితే, ఇది ప్రపంచంలో ఙనీ మంది సేవించే రెండో ద్రవపదార్థము.బీర్ మూడోది అయితే కాఫీ నాలుగొవది అంటారు.బీర్ సంగతి ఏమో కాని ప్రపంచ జనాభాలో 75% నుంచి 100% రోజు అయితే టీ లేదా కాఫీ తాగుతారు.మన దేశంలో టీ తాగే అలవాటు విపరీతంగా ఉంటుంది.

కాఫీ అలవాటు ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతుంది.

వీటిని మొత్తానికే తాగకూడదు అని కాదు.

తాగొచ్చు.కాని రోజుకి ఓ డ్రింక్ చాలు.

పొద్దున్న ఓసారి, సాయంత్రం ఓసారి తాగేవారు ఉంటారు.అలాంటివరు టీపోడి లేదా కాఫీ పొడి తక్కువ కాంసెంట్రేషన్ లో ఉండేలా చూసుకోవాలి.

రెండిట్లోనూ కెఫైన్ ఉంటుంది.తక్కువ పడితే ఎంత మంచిదో, ఎక్కువ పడితే అంతే చెడ్డది.

ఇక మరో ముఖ్యమైన విషయం చెప్పాలంటే, టీ లేదా కాఫీ తాగే ముందు మంచినీళ్ళు తాగాలి.ఇలా మంచినీళ్ళు తాగాకే టీ లేదా కాఫీ ముడుతున్నారంటే అదే పద్ధతి కంటిన్యూ చేయండి.

అలా చేయట్లేదో .వచ్చే నష్టం ఏంటో చూడండి.

టీపొడి టీ ఆకులతో తయారుచేస్తారు, కాఫీ పొడిని కాఫీ బీన్స్ తో తయారుచేస్తారు.టీతో పోల్చుకుంటే కాఫీలో కెఫైన్ ఎక్కువ.ఒకవేళ మీరు కాఫీ లేదా టీ తాగే ముందు మంచినీళ్ళు తీసుకున్నారనుకోండి, ఆ కెఫైన్ కడుపులో పడగానే నీటి ప్రభావంతో డైలట్ అయ్యి కొంత బలహీనం అవుతుంది.దాంతో కెఫైన్ ప్రభావం తగ్గుతుంది.

కాఫీలో 5 pH లెవెల్స్ ఉంటాయి, అలాగే టీలో 6 pH లెవల్స్ ఉంటాయి.ఈ పీహెచ్ లెవల్స్ ఒక పదార్థం యొక్క అసిడిక్ వేయిట్ ని చెబుతాయి.

ఈ లెక్కన టీ కాని, కాఫీ కాని, కడుపులో ఆసిడ్ రిఫ్లెక్స్ కి కారణం కావొచ్చు.అదే జరిగితే అల్సర్, ఛాతిలో మంట, సమస్య ఎక్కువయితే చివరికి కోలాన్ క్యాన్సర్ కూడా రావొచ్చు.

మరి ఈ ఆసిడిక్ ప్రభావం తగ్గాలంటే నీళ్ళు తాగాల్సిందే.

అలాగని చెప్పి కాఫీ, టీ మొత్తానికి ప్రమాదం అని చెప్పలేం.

శరీరంలో ఓ పని మీద దృష్టి పెట్టాలన్నా, అలసిపోయిన తరువాత కాస్త శక్తిని, రిలీఫ్ ని పొందాలన్నా కెఫైన్ పనికొస్తుంది.కాబట్టి ఓ లిమిట్ గా తీసుకోండి.

వాటికి బానిసత్వం చేయొద్దు.అలాగే అలసత్వం ప్రదర్శించి ముందు మంచినీళ్ళు తాగడం మరచిపోవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube