సెక్స్ తరువాత మూత్ర విసర్జన చేయాలా? -Why Should One Urinate After Sex? 3 months

 Photo,Image,Pics-

గమనించి ఉంటారు, సెక్స్ పూర్తయిన తరువాత కాని, హస్తప్రయోగం చేసుకున్న తరువాత కాని, మూత్ర విసర్జన చేయాలి అనిపిస్తుంది. ఒక్కోసారి మూత్రం దానంతట అదే వస్తుంది. స్త్రీలలో అయితే మూత్ర విసర్జన జరగటం ఇంకా ఎక్కువ. మరి సెక్స్ తరువాత మూత్ర విసర్జన చేయడం కరెక్టేనా అంటే ముమ్మాటికి కరెక్టే.

* ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమైమ విషయం. సెక్స్ సమయంలో జరిగే రాపిడి వలన ఒకరి శరీరంలోంచి మరొకరి శరీరంలోకి కొన్నిరకాల బ్యాక్టీరియా పదార్థాలు వెళ్ళవచ్చు. మూత్రం వాటిని బయటకి తీసుకువస్తుంది.

* కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు యురెత్రాలోకి వెళితే ఇంఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు మూత్రమే సహాయం చేసేది.

* మహిళలు యూరినరి ట్రాక్ ఇంఫెక్షన్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సెక్స్ తరువాత మూత్ర విసర్జన చేస్తే ఇలాంటి యూటిఐ ఇంఫెక్షన్స్ ని దూరం పెట్టవచ్చు.

* శృంగారం తరువాత మూత్ర విసర్జన చేస్తే మలీనాలు, మైక్రోబ్స్ బ్లాడర్ లోకి, కిడ్నీల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు.

* మూత్ర విసర్జన మీ ఆరోగ్యాన్ని తెలుపుతుంది. సెక్స్ తరువాత కాని, సెక్స్ తరువాత కొన్ని గంటల్లో కాని, మూత్రం రంగులో తేడా కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.

* సెక్స్ తరువాత మూత్ర విసర్జన చేయడం ఒక హైజీనిక్ హ్యాబిట్ గా చెబుతారు సెక్సాలాజిస్టులు. సాధ్యమైనంతవరకు, కనీసం చిన్నిపాటి ఇంఫెక్షన్స్ నుంచైనా మనల్ని కాపాడుతుంది ఈ అలవాటు. అలాగే కండోమ్ వాడినా సరే, మూత్ర విసర్జన చేయడం మర్చిపోవద్దు.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...గర్భిణీలకు ప్రశాంతమైన నిద్ర రావాలంటే ఎలా

About This Post..సెక్స్ తరువాత మూత్ర విసర్జన చేయాలా?

This Post provides detail information about సెక్స్ తరువాత మూత్ర విసర్జన చేయాలా? was published and last updated on in thlagu language in category Telugu Health,Telugu Health Tips,Telugu News.

Urinate After Sex, Women have a higher risk, urine infections, Cleaning Private Parts, Haijinik habit, సెక్స్ తరువాత మూత్ర విసర్జన చేయాలా?

Tagged with:Urinate After Sex, Women have a higher risk, urine infections, Cleaning Private Parts, Haijinik habit, సెక్స్ తరువాత మూత్ర విసర్జన చేయాలా?,శృంగారం తరువాత మూత్ర విసర&#3149