సినిమాల్లోనే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నిజజీవితంలో కూడా కొంచెం తిక్క ఎక్కువే అని అంటారు ఆయన సన్నిహితులు.కాని ఆ తిక్కకు లెక్క కూడా ఉంటుందండోయ్.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కోపమొచ్చిందట.అది కూడా కాటమరాయుడు దర్శకుడు డాలి మీద.లక్షలు ఖర్చయ్యాక, ఒక రోజంతా షూటింగ్ క్యాన్సిల్ చేసేంత కోపం అది.
డాలి మంచి దర్శకుడు అని మనందరికీ తెలుసు.తొలిచిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం సక్సెస్ తరువాత తడాఖా, గోపాల గోపాల లాంటి హిట్స్ ఉన్నాయి డాలికి.ఆ ట్రాక్ రికార్డు వల్లే కాటమరాయుడు దక్కించుకున్నాడు ఈ దర్శకుడు.
కాని పవన్ పెట్టుకున్న నమ్మకాన్ని చిన్నగా దెబ్బతీసాడంట డాలి.ఇటివలే సెట్స్ పై ఓ సన్నివేశాన్ని సరిగా వివరించలేకపోయాడట పవన్ కి.దాంతో పవర్ స్టార్ కి కోపమొచ్చిందట.వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసి సెట్లోంచి వెళ్ళిపోయాడట పవన్.
ఇప్పుడు ఈ వార్త పవన్ అభిమానులని కలవరపెడుతోంది.హీరో దర్శకుడి మధ్య సరైన సంబంధాలు లేకపోతే మిగితా షూటింగ్ సవ్యంగా ఎలా జరుగుతుంది, సినిమా ఎలా తయారవుతుందో అనేది అభిమానుల బాధ.