ఇక పవన్ కళ్యాణ్ మారడా అంటున్నారు

మహేష్ బాబు తదుపరి సినిమా స్పైడర్.రోబోటిక్ స్పైడర్స్ వాడుతూ, స్పైడర్ సెన్స్ ఉన్న ఒక ఇంటలెజిన్స్ ఆఫీసర్ బయో టెర్రరిజం కార్యకలాపాలను ఎలా అంతం చేసాడు అనేది ఈ చిత్ర మూలకథ అని తెలుస్తోంది.

 Why Pawan Kalyan Is Turning Outdated?-TeluguStop.com

వింటుంటే ఏదో హాలివుడ్ స్థాయి కథలా ఉంది కదూ.నిన్న విడుదలైన టీజర్ గ్లింప్స్ ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో చెప్పకనే చెప్పుంది.

ఎన్టీఆర్ తదుపరి సినిమా జైలవకుశ.మూడు పాత్రలు.మూడు పోషించేది తానే.హీరో తానే, విలన్ తానే.

ఆ మూడు పాత్రల్లో కూడా ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చూసుకుంటున్నాడట యంగ్ టైగర్.అందులో ఒక పాత్రకి నత్తి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే తదుపరి సినిమా సుకుమార్ తో.పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతున్న ఓ డిఫరెంట్ సినిమా ఇది.ఇందులో చరణ్ కి చెవిటి అని టాక్ ఉంది.ఇక ప్రభాస్ సాహో అత్యున్నత ప్రమాణాలతో సరికొత్త కథతో రాబోతోంది.

బన్ని డీజేతో ఓ రోటిన్ సినిమానే చేస్తున్నా, ఆ తరువాత విక్రమ్ కుమార్ తో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ చేయనున్నాడని సమాచారం.ఇలా స్టార్ హీరోలంతా కొత్త కథలు, డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటూ, తెలుగు సినీపరిశ్రమకు బాహుబలి తీసుకొచ్చిన కీర్తిని, సంపదను మేయింటేన్ చేసేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు.

కాని పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా రీమేక్స్, రొటిన్ మాస్ సినిమాలే చేస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమా కథ మరీ కొత్తగా ఏమి ఉండదు అంట.ఏంతైనా ఇదో ఉపశమనం అనుకోండి.కాని ఆ తరువాత మళ్ళీ మొదటికే వస్తున్నాడు పవర్ స్టార్.

వేదాలం రీమేక్, సంతోష్ శ్రీనివాస్ తో మాస్ సినిమా .ఇవి సరిపోనట్టు మళ్ళీ వివి వినాయక్ తో మరో మాస్ సినిమా.ఇలా రెగ్యలర్ మాస్ సినిమాలే చేస్తూ, ఒక మూసలో ఉండిపోతున్నాడు పవర్ స్టార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube