కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

నష్టాలు, బాధల నుండి బయట పాడేసే శక్తి సత్యనారాయణ వ్రతంనకు ఉంది.అందుకే ఈ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది.

 Why New Daughter-in-law Enterd  Satyanarayana Vratam ?-TeluguStop.com

సాదారణంగా ఈ వ్రతాన్ని కార్తీకమాసంలో జరుపుకుంటారు.ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయి మొదట అత్తవారింట అడుగు పెట్టాక మొదట ఈ వ్రతాన్ని చేయించటం అనాదిగా ఆచారంగా ఉంది.

సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషం కలుగుతుందని చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణస్వామి భూమిపై ఆవిర్భవించారని అసాధారణమైన శక్తిని కలిగిన ఉన్నారని భక్తుల విశ్వాసం.

కొత్తగా పెళ్ళైన దంపతులు వారి జీవన ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణస్వామిని వేడుకుంటూ వ్రతాన్ని చేస్తారు.

ఈ వ్రతం చేసుకొనే సమయంలో ఆ ఊరిలో వారి అందరిని పిలుస్తారు.

ఆ సమయంలో కొత్త కోడలిని చూసినట్టు అవుతుంది.కొత్త కోడలికి కూడా ఆ ఊరి వారు అందరూ తెలుస్తారు.

దాంతో కొత్తగా వచ్చిన కోడలికి బెరుకు పోయి తొందరగా అందరిలోనూ కలిసిపోతుంది.ఈ వ్రతం సమయంలో తమ కోడలిని అందరికి పరిచయం చేయటంను అత్తమామలు శుభ సూచకంగా భావిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube