మార్నింగ్ వాక్ ఎందుకు చేయాలి?

శరీరం మీద భక్తి శ్రద్ధలే ఉంటే, రోజూ ఉదయాన్నే లేచి తప్పకుండా మార్నింగ్ వాక్ కి వెళతారు.“ఇలా చేస్తే ఏంటి లాభం”? అని లేట్ గా లేచే బద్ధకస్తులు అడగొచ్చు.వారికోసమే ఈ ఈ ఆర్టికల్.

 Why Morning Walk Is Compulsory?-TeluguStop.com

* రోజూ ఓ 20 నిమిషాలపాటు మార్నింగ్ వాక్ చేస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం 30% తగ్గుతుందని పరిశోధకుల అంచనా.

* పొద్దున్నే వాకింగ్ చేస్తే ఇటు చల్లగాలితో పాటు, ఆరోగ్యకరమైన తెల్లవారి సూర్యకిరణాలు శరీరాన్ని తాకుతాయి.

* అధిక బరువు సమస్యలను తగ్గించుకోవడానికి, బరువు పెరగకుండా అడ్డుకోవడానికి మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగం.

* బ్లడ్ ప్రెషర్ అదుపులో లేక ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు చాలామంది.రోజూ మార్నింగ్ వాక్ చేస్తే ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు.

* ఇమ్యునిటి సిస్టమ్ ఎంత బలంగా ఉంటే, రోగనిరోధకశక్తి అంత ఎక్కువగా ఉంటుంది.రోజు 40-50 నిమిషాలు వాకింగ్ చేసే శరీరంలో ఇమ్యునిటి సెల్స్ పెరుగుతాయని అధ్యయనాల్లో తేలింది.

ఈరకంగా రోగనిరోధకశక్తిని పెంచి, శరీరాన్ని ఇంఫెక్షన్ల నుంచి కాపాడటానికి వాకింగ్ సహాయపడుతుంది.

* రోజూ వాకింగ్ చేస్తే ఎనడొర్ఫీన్స్ అనే హార్మోన్ విడుదల అవుతుంది.

ఇది సంతోషాన్ని పెంచే హార్మోన్.కాబట్టి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి మార్నింగ్ వాక్ ఉపయోగపడుతుంది .

* మార్నింగ్ వాక్ వలన శరీరంలోని ప్రతి సెల్ కి, రక్తప్రసరణ బాగా జరగడమే కాకుండా, ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా అందుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube