పొడుగున్న అమ్మాయిలంటే మగవారికి ఎందుకు ఇష్టం?

భారతదేశంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లు ఎవరు? ఠక్కున చెప్పాలంటే దీపికా పదుకునే, కత్రీనా కైఫ్, సన్ని లియోన్, జాక్వేలీన్ ఫేర్నాండిజ్ .ఇలాంటి పేర్లే నోటినుంచి వస్తాయి.

 Why Men Get Attracted To Tall Women?-TeluguStop.com

ఒకప్పుడు పెద్ద హీరోయిన్లుగా ఎదిగిన మాధురి దీక్షిత్, ఐశ్వర్యరాయ్ లాంటి వారు పెద్ద పొడగరులేం కాదు.కాని కాలం మారింది.

అబ్బాయిల టేస్ట్ కూడా మారింది.ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లన్ని పొడుగైన సుందరిలవే.

మరి పొడుగుండే అమ్మాయిలను ఎందుకు ఇష్టపడితున్నారు అబ్బాయిలు ?

* పొడుగున్న అమ్మాయిలకి దాదాపు అన్నిరకాల డ్రేస్సులు నప్పుతాయి.ఎలాంటి డ్రెస్ లో అయినా, వారు పెద్దగా ఎబ్బెట్టుగా కనిపించరు.

అందుకేనేమో .అబ్బాయిల కనులు ఎక్కువగా పొడవు సుందరిల వైపు మళ్ళుతాయి.

* ఎలా అంటే చెప్పటం కష్టం కాని, పొడవుండే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, కొంచెం ఎక్కువ ఆకర్షణీయంగా కనబడతారు.

* పొడవుండే అమ్మాయిలకి ఆత్మవిశ్వాసం ఎక్కువ.కనులు పైకి ఎత్తకుండా, సమానంగా చూడగలుగుతారు చాలామందిని.అది కాకుండా, పొడవుండే అమ్మాయిలలో ఏదో లోపం వెతికి కామెంట్ చేసే అవకాశం తక్కువ.

అందుకే వారి ఆత్మవిశ్వాసం ముఖంలో కూడా అందంగా కనిపిస్తుంది.

* పెద్ద పెద్ద మోడల్స్ ని చూడండి .కెండిల్ జన్నర్ లాంటి వాళ్ళు అంత పెద్ద మోడల్ అవడానికి తన ఎత్తు కూడా ఓ కారణం.మన దీపిక పదుకొనే కూడా మొదట మోడల్ గానే కెరీర్ మొదలుపెట్టింది.

పొడవుగా ఉండే అమ్మాయిలు మోడల్స్ లాగా ఆకర్షణీయంగా కనిపిస్తారు.

* పొడవుగా ఉండే అమ్మాయిల నడక చాలా అందంగా కనిపిస్తుంది.

ఆ వయ్యారాల వలనే ఏమో .ఈజిగా పడిపోతారు అబ్బాయిలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube