మగవారు తక్కువగా ఎందుకు ఏడుస్తారు ?

ఆడవారి కన్నీరు కన్నా మగవారి కన్నీరుకి విలువ ఎక్కువ.ఇది ఆడవారు కూడా కాదనలేని వాస్తవం.

 Why Men Don’t Cry Much?-TeluguStop.com

ఎందుకంటే మగవారు ఏడవడం చాలా అరుదు.భరించలేని బాధ ఉన్నా, ఎడవడం కష్టమే.

మగవారి కన్నీరు బయటపడింది అంటే, అది మామూలు విషయం కాదు.కాని అడవారు అలా కాదు.

చిన్ని బాధ వేసిన కన్నీటిధార మొదలవుతుంది.ఇలా ఎందుకు? మగవారిది రాతిగుండెనా? మగవారికి బాధగా అనిపించదా?

మగవారికి కూడా బాధ వేస్తుంది.అడవారికి ఏమాత్రం తగ్గని భావోద్వేగాలు మగవారిలో కూడా ఉంటాయి.కాని అవి బయటకి చూపెట్టడం కష్టం.దానికి కారణం మగవారిలో ఉండే ఆండ్రొజన్స్, వాటిలోని ప్రధాన హార్మోన్ టెస్టోస్టిరోన్.ఈ హార్మోన్ వల్లే మగవారికి ఏడుపు, కన్నీరు పై ముందు నుంచి అయిష్టత ఉంటుంది.

అలాగే బాధవేసినా, లోలోనే బాధపడతారు తప్ప, ఎక్కువగా ఏడవరు.ఆడవారిలో టెస్టోస్టిరోన్ కి బదులు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ మొతాదులో ఉండటం వలన అమ్మాయిలు ఎక్కువగా ఏడుస్తారు.

ఇది మాత్రమే కాదు, చిన్ననాటి నుండి వేరే మగవాళ్ళు ఏడుస్తుండగా ఒక అబ్బాయి చూడటం చాలా అరుదుగా జరుగుతుంది.కాబట్టి ఏడవడం మగజాతి లక్షణం కాదని తక్కువ వయసులోనే ఫిక్స్ అయిపోతారు అబ్బాయిలు.

ఈరకంగా అబ్బాయి పెరిగిన వాతవరణం కూడా భావోద్వేగాలను వ్యక్తపరచడం మీద ప్రభావం చూపుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube