పెళ్లికూతురుని గంపలో ఎందుకు తీసుకువస్తారు?

మన హిందూ సంప్రదాయంలో వివాహం సమయంలో పెళ్లి కూతురుని గంపలో తీసుకురావటం అనేది ఒక సంప్రదాయంగా ఉంది.అయితే ఈ సంప్రదాయం కొంత మందికి మాత్రమే ఉంది.

 Why Hindu Bride Comes In Pelli Gampa..?-TeluguStop.com

అసలు పెళ్లికూతురుని గంపలో ఎందుకు తీసుకువస్తారు? ఆ వివరాల్లోకి వెళ్ళితే….ఈ సంప్రదాయం వెనక గొప్ప అర్ధం ఉంది.

సాధారణంగా ఆడపిల్ల పుట్టగానే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అంటారు.అలాగే సిరి సంపదలు కూడా ఆ ఆడపిల్ల వలనే వచ్చాయని నమ్ముతారు.

ఆడపిల్లను అత్తారింటికి పంపటం అంటే సంపదలను ఇవ్వటమే.సంపదల తల్లి లక్ష్మి దేవి తామర పువ్వులో ఉంటుంది.

అటువంటి మా ఇంటి మహాలక్ష్మిని తామరపువ్వు వంటి గంపలో పెట్టి పెళ్లి మండపానికి తీసుకువస్తారు.ఈ విషయాన్ని వరుడికి అర్ధం కావటానికి పెళ్లికూతురును గంపలో పెళ్లి మండపానికి తీసుకువస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube