Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఆ సమయంలో వక్షోజాలు ఎందుకు నొప్పిగా ఉంటాయి ? నొప్పి ఎలా తగ్గాలి ?-Why Do Women Breasts Swell And Pain At That Time ?

ఇక ఈ నొప్పి ఎందుకు వస్తుంది అంటే ప్రోగ్రెస్టీరోన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవడం వలన. దాంతో వక్షోజాల్లోని డక్ట్స్ సైజ్ పెరిగిపోతాయి. వాటర్ రెంటేన్స్హన్ కూడా జరగటంతో వక్షోజాలు ఉబ్బినట్టుగా అనిపిస్తాయి. దాంతో నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి ప్రతి ఒక్కరి కేసులో ఒకేలా ఉండకపోవచ్చు. ఎవరి శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్స్ విడుదలని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది. కొందరికి నొప్పిగా ఉండకపోవచ్చు కూడా. మరికొందరికి వక్షోజాలతో పాటు నిపుల్స్ కూడా నొప్పివేస్తాయి. అందుకే నొప్పి అందరికి ఇలానే ఉంటుంది అని స్పష్టంగా చెప్పలేం.


మరి ఈ నొప్పి నార్మలా కాదా ? వక్షోజాల సైజు పెరిగినట్టుగా, బరువుగా, ఉబ్బినట్టుగా అనిపించడం సహజమే. ఇదేమి అనారోగ్యం కాదు. కాని రెండు వక్షోజాల్లో నొప్పి ఒకేలా ఉండాలి. రెండు వక్షోజాల బరువు ఒకేలా అనిపించాలి. రెండు వక్షోజాలు ఒక్కే సైజులో ఉబ్బినట్టుగా అనిపించాలి. అలా కాకుండా, ఒకవైపు నొప్పి ఎక్కువ, ఒకవైపు తక్కువగా ఉంటే అది నార్మల్ కండీషన్ కాదు. డాక్టర్ దగ్గరకి మీరు వెళ్ళాల్సిందే అనే హెచ్చరిక. అలాగే ఈ నొప్పి ఎక్కువ రోజులు ఉంటే కూడా అది అబ్నార్మాల్ కండిషన్.

మరి ఈ నొప్పిని ఎలా అడ్డుకోవాలి ? మంచి బ్రా వాడాలి. ఇబ్బందిపెట్టని బ్రా వాడాలి. కాఫీ అలవాటు అదుపులో ఉంచుకోవాలి. విటమిన్ ఈ, విటమిన్ బి6 ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.. లిబు ప్రోఫెన్ .. ఇంకొన్ని మందులు కూడా ఉంటాయి కాని ఏం వాడాలనుకున్నా ముందు డాక్టర్ ని సంప్రదించాలి.

Continue Reading
More Posts
To Top