Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

దేవాలయాల మీద శృంగార భంగిమలు ఎందుకు ఉంటాయి ? కారణం ఏమిటి ?-Why Do We See Sex Sculptures On Hindu Temples ?

ఇప్పుడు కొత్తగా కడుతున్న దేవాలయాలు కాదు కాని, కొన్ని ప్రాచీన దేవాలయాలను గమనిస్తే వాటి మీద శృంగార క్రీడలు , భంగిమలు చెక్కి ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా ? దేవాలయాలు పవిత్రమైనవి. భక్తులు పూజల కోసం గుడికి వస్తారు. మరి నాలుగు గోడల మధ్య జరిగే ఆలుమగల రతిక్రీడలను చెక్కడం వెనుక అంతరార్థం ఏమిటి ? ఈరోజుల్లో సెక్స్ అనేది చాలా ప్రైవేట్ వ్యవహారం. దాన్ని ఓ బూతులా, అపవిత్రంగా చూసేవారు ఉన్నారు. మరి ప్రాచీన సంప్రదాయాలలో శృంగారానికి ఎందుకు ఇంత ముఖ్యతనిచ్చారు?

పురుషుడు “ధర్మ, అర్థ, కామ, మోక్ష” వీటికి తప్పకుండా పొందాలని, ఇవి పొందితేనే అది సంపూర్ణమైన జీవితం అని పూర్వం చెప్పేవారు. వీటినే చతుర్విధపురుషార్థాలు అని అంటారు. ఇక్కడ ధర్మం అంటే జ్ఞానం, చదువు. జీవితంలో మొదట సాధించాల్సింది చదువుని. ఇక్కడ ధర్మం అని ఎందుకు అన్నారు అంటే ఆ రోజుల్లో చదువు అంటే సనాతన ధర్మం యొక్క గ్రంథాలైన వేదాలు చదవటం. వాటిలోనే సోషల్, సైన్స్, మ్యాథ్స్ అన్ని ఉంటాయి. ఆ తరువాత అర్థం, అంటే సంపద. ఈనాటి రూపాయి నోట్లు కావు సంపద అంటే. జీవనోపాధి సంపాదించుకోవడం. వ్యవసాయం చేయడం. పశువులని కలిగి ఉండటం. అప్పుడు చలామణి అవుతున్న ధనాన్ని కలిగి ఉండటం. డబ్బు అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పటికైనా అవసరమే కదా.

Continue Reading
To Top