Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

తిన్నవెంటనే నిద్ర ఎందుకు వస్తుంది మనకు ?-Why Do We Feel Sleepy After A Big Meal ?

ఆఫీసుకి వెళ్ళినా, స్కూల్ కి వెళ్ళినా, మార్నింగ్ అవర్స్ చురుగ్గా ఉంటారు జనాలు. పనులన్నీ చక చక చేస్తుంటారు. మధ్యాహ్నం అవుతుంది, లంచ్ బాగా తింటారు. అంతే, ఇక తంటాలు మొదలు. నిద్ర ముంచుకు వస్తుంది. రాత్రి కూడా ఇలాంటి నిద్ర రాదేమో. నిద్ర ముంచుకొస్తే ఇంకేముంది .. పని మీద ధ్యాస అస్సలు ఉండదు. ఎవడు చేస్తాడ్రా బాబు ఇదంతా అంటూ పని మీద విరక్తి, విసుగు వచ్చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది ? మధ్యాహ్నం మన మెదడు ఎందుకు చురుగ్గా పనిచేయదు ? తిండి తినేది ఎనర్జీ కోసమే కదా, మరి ఇంకా బాగా పనిచేయాల్సింది పోయి నిద్ర ఎందుకు వస్తుంది ? శరీరం ఎదో అలసిపోయినట్టు విశ్రాంతి ఎందుకు కోరుకుంటుంది ? దీని వెనుక సైన్స్ ఏమిటి ?

మనం భోజనం చేసిన తరువాత కొన్ని హార్మోన్స్ విడుదల అవుతాయి. పేరుకి చెప్పాలంటే గ్లుకాగోన్, అమిలిన్, సిసికె లాంటి హార్మోన్లు. వీటి వలన బ్లడ్ షుగర్ పెరిగి, ఆ తరువాత ఇన్సులిన్ విడుదల అయ్యి, రక్తంలో ఉన్న షుగర్ ని సెల్స్ లోకి పంపించి, దాన్ని ఎనర్జీ, అంటే బలం రూపంలోకి మారుస్తుంది. ఈ ఎనర్జీ మనిషికి అత్యవసరం. లేదంటే శరీరం ఏ పనికి సహకరించదు. చివరకి శ్వాస కూడా తీసుకోకుండా అయిపోతుంది. అందుకే మనుషులు మూడు పూటలా తింటారు. అందుకే మనకు ఆకలి వేస్తుంది. ఇక ఈ హార్మోన్స్ తో పాటు, మెలటోనిన్ అనే హార్మోన్ పై కూడా మన తిండి ప్రభావం పడుతుంది. ఈ హార్మోనే మనకు నిద్రను తీసుకొచ్చేది. కాబట్టి మనం ఏం తింటున్నాం అనే దాన్ని బట్టి యాక్టివ్ గా ఉంటామా లేదా నిద్ర పుట్టుకొస్తుందా అనేది జరుగుతుంది.

Continue Reading
More Posts
To Top