గోమాతను ఎందుకు పూజిస్తారో తెలుసా..?

పల్లెటూర్లు,చిన్న చిన్న గ్రామాలలో గోమాతను ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటారు.ఎందుకంటే వారి జీవనం గోవులతో ముడిపడి ఉంటుంది.

 Why Do Hindus Worship The Cow-TeluguStop.com

ఆవులు ఇచ్చే పాలతో వారు జీవనాన్ని గడపటం వలన ఆవులను భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు.ఆలా అని అందరూ పూజలు చేయరు.

కొంత మంది మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు.

ఆవును గోమాతగా చెప్పటానికి మన పురాణాల్లో కొన్ని కధలు కూడా ఉన్నాయి.

పురాణాల్లో గోవును దేవత స్వరూపంగా చెప్పారు.మన పూర్వీకులు గోవును పూజిస్తే సకల పాపాలు పోతాయని నమ్మకం.

అందుకే గోవును పూజించటం ఒక ఆచారంగా మారింది.

గోమాత నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమద్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారు.

అంతేకాక కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి.ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై ఉండుట వలన మన పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube