గర్భిణీ స్త్రీలు క్యాబేజి తినొచ్చా?

గర్భం దాల్చేదాకా ఒకటే శరీరం.కాని గర్భం దాల్చాక రెండు శరీరాలకి అహారాన్ని అందించాలి స్త్రీ.

 Why Cabbage Is Good For Pregnant Women?-TeluguStop.com

ఇలాంటి సమయంలో చాలా అనుమానలుంటాయి.ఏం తినొచ్చు, ఏమి తినకూడదు అని.క్యాబేజీ చాలా హెల్తి ఫుడ్.మరి దీన్ని గర్భం సమయంలో తినొచ్చా లేదా అనే అనుమానం వచ్చినా రావొచ్చు.

కాని క్యాబేజీ తినటం గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.కాని పచ్చిగా మాత్రం తినకూడదు.

* ఆర్గానిక్ క్యాబేజి తీసుకున్నట్లుయితే ఇందులో విటమిన్ సి,కే,బి6,బి1,బి3, ఐరబ్, కాల్షియం, మెగ్నేషియం, పొటాషియం, మొదలగు న్యూట్రింట్స్ ఉంటాయి.

* క్యాబేజిలో లభించే ఫొల్లెట్ DNA హెల్త్ కు మంచిది.

* గర్భంతో ఉన్న సమయంలో స్త్రీలలో వాపులు గమనించవచ్చు.ముఖం, కాళ్ళు, చేతులు .ఇలా కొన్ని శరీరభాగాలు వాపుకి గురికావచ్చు.ఈ సమస్యకు క్యాబేజి చక్కని పరిష్కారం.

* గర్భంతో ఉన్న టైమ్ లో స్త్రీలలో జస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది.క్యాబేజీలో ఉండే న్యూట్రింట్స్ వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ తోపాటు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

* ప్రెగ్నెంట్ మహిళలకు జీర్ణశక్తి చాలా అవసరం.మెటబాలిజం కూడా బాగుండాలి.

క్యాబేజీలో దొరికే ఫైబర్ కంటెంట్ జీర్ణశక్తిని పెంచుతుంది.మలబద్ధకం లాంటి సమస్యను దూరం పెడుతుంది.

బౌల్ మూమెంట్ ని ట్రాక్ లో పెడుతుంది

* అధికబరువుతో బాధపడేవారు క్యాబేజీని డైట్ లో చేర్చుకుంటే మంచిది.ఎందుకంటే తక్కువ కాలరీలనిస్తూ, మంచి న్యూట్రింట్స్ ని అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube