భారత్ మీద సీరియస్ అవుతున్న అమెరికా ?

ఇరాన్ తో క్రూడాయిల్ సరఫరాకు డీల్ కుదుర్చుకుని చాబహార్ సమీపంలో నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని భారత్ నిర్ణయించుకోవడాన్ని అమెరికా సెనెటర్ ఆక్షేపించారు.ఈ ప్రాజెక్టుతో అంతర్జాతీయ నిబంధనల అతిక్రమణ జరుగుతోందని, తమ అధికారులు ఈ ప్రాజెక్టును నిశితంగా పరిశీలిస్తున్నారని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖ సహ కార్యదర్శి నిషా దేశాయ్ బిస్వాల్ తెలిపారు.

 Why American Companies Are ‘angry’ With India-TeluguStop.com

ఇరాన్ తో బంధాన్ని పెంచుకునే విషయమై, భారత్ హద్దుల్లో ఉండాలన్నదే తమ అభిమతమని ఆమె స్పష్టం చేశారు.చాబహార్ ప్రకటనను పరిశీలిస్తున్నామని, దీన్ని సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీకి పంపనున్నామని తెలిపారు.

కాగా, రెండు రోజుల క్రితం తన ఇరాన్ పర్యటనలో భాగంగా, దాదాపు రూ.3,300 కోట్ల అంచనా వ్యయంతో చాబహార్ పోర్టును అభివృద్ధి చేసి క్రూడాయిల్ సరఫరాను మరింత సులువు చేసుకునే దిశగా డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube