అలాగైతే కష్టాలు తప్పవు పవన్

బాహుబలికి ముందు దక్షిణాది సినిమాలు హిందీలోకి చాలానే వెళ్ళాయి.పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు .

 Who Will Promote Sardaar Gabbar Singh In Hindi?-TeluguStop.com

అందరూ ట్రై చేసారు.అంతదాకా ఎందుకు .బాహుబలికి ముందు ఇదే రాజమౌళి సినిమా ఈగ హిందీలో విడుదల చేస్తే ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు.కాని అక్కడే రాజమౌళి గుణపాఠం నేర్చుకున్నాడు.

కేవలం సినిమాలో దమ్ముంటే సరిపోదు .హిందీవాళ్ళకి బాగా తెలిసిన ముఖం ఒకటి సినిమాని అక్కడ పరిచయం చేయాలని అర్థం చేసుకున్నాడు
అందుకే బాహుబలి కోసం కరణ్ జోహర్ లాంటి అగ్ర దర్శకనిర్మాతని పట్టాడు రాజమౌళి.హిందీ ప్రమోషన్స్ మొత్తం కరణ్ చూసుకున్నాడు.పెద్దగా రిలీజ్ చేసాడు.జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు.ఫలితం .వంద కోట్లకు పైగా కలెక్షన్లు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ని హిందీలోకి దింపుతున్నాడు సరే… ఎరోస్ సంస్థ థీయేటర్లు బాగా దొరకబడుతుంది, ప్రమోషన్స్ బాగా చేస్తుంది .కాని జనాలు థియేటర్లకి వెళ్ళాలంటే ఎవరైనా తెలిసినవాళ్ళు వెళ్ళమని చెప్పాలి కదా! రాజమౌళికి కరణ్ జోహర్ సహాయపడ్డట్టు .పవన్ కి కూడా ఎవరో ఒకరు సహాయపడాలి కదా! ఎవరి సహాయం అక్కరలేదు అని పవన్ మొండికేస్తే మాత్రం హిందీలో కష్టాలు తప్పవు …

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube