అఖిల్ తర్వాతి సినిమాలు ఎవరితో !

అక్కినేని అఖిల్, రోజురోజుకి సంచలనంగా మారుతున్నాడు.చేసిన మొదటి చిత్రమే 45 కోట్ల బిజినెస్ చేయడం ఒక ఎత్తు, ఇప్పుడు సినిమా రిలీజ్ విషయంలో అఖిల్ తీసుకుంటున్న జాగ్రత్త ఒక ఎత్తు, వీటికి మించి అఖిల్ కెరీర్ ప్లానింగ్ మరో ఎత్తు.

 Who Will Direct Akhil After Vinayak-TeluguStop.com

అఖిల్ తర్వాతి సినిమా శ్రీను వైట్ల తో ఉంటుందని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం శ్రీను వైట్లతో “బ్రూస్లీ” చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్య అఖిల్- శ్రీను వైట్ల సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్.

ఇక శ్రీను వైట్ల తరువాత పూరి జగన్నాధ్ లో కథ చర్చలు జరుగుతాయని వినికిడి.పూరి చిత్రాన్నిబండ్ల గణేష్ నిర్మిస్తారని సమాచారం.

నాగార్జున, నాగ చైతన్య ఫ్యామిలి, లవ్ సినిమాల మీద పడి సాఫ్ట్ హీరోలుగా ముద్ర వేసుకున్నారు.అక్కినేని ఫ్యామిలికి లేని మాస్ ఫాలోయింగ్ ని అఖిల్ ద్వారా సంపాదించుకోవాలని నాగార్జున ప్లాన్.

అందుకే మొదటి చిత్రం వినాయక్ లాంటి మాస్ దర్శకుడి చేతికిచ్చారు నాగార్జున.ఇప్పుడు తర్వాతి సినిమాలు కుడా మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube