పామ్ ఆయిల్ ఎవరు వాడాలి? ఎవరు వాడకూడదు?

మనం వంటల్లో వాడే నూనే మన శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది.మనం వాడే ఆయిల్ ని బట్టే కొవ్వు పెరగటం, బరువు పెరగటం, ఆక్నే రావడం, ఇలాంటి సమస్యలు రాకపోవడం ఆధారపడి ఉంటాయి.

 Who Should Use Palm Oil And Who Shouldn’t?-TeluguStop.com

ఆయిల్ అనగానే మనకు పామ్ ఆయిల్ అని, పల్లిల నూనే అని రకరకాల ఆయిల్స్ గుర్తుకువస్తాయి.అయితే పామ్ ఆయిల్ మీద నడిచే చర్చ వేరు.

దీన్న వంటల్లో వాడొచ్చా, వాడరాదా? పామ్ ఆయిల్ తో చేసిన వంటలు ఆరొగ్యానికి మంచివా కావా? ఇలాంటి సందేహాలు రోజు వస్తాయి.మరి పామ్ ఆయిల్ అందరు అనుకున్నట్లుగా శరీరానికి మంచిది కాదా? దీన్ని ఎవరు వాడొచ్చు, ఎవరు వాడకూడదు?

#ఎవరు వాడకూడదు?

* పామ్ ఆయిల్ లో సాచురేటేడ్ ఫ్యాట్స్ ఎక్కువ.మీకు ఇప్పటికే కొలెస్టిరాల్ సమస్యలు ఉంటే మాత్రం పామ్ ఆయిల్ జోలికి అస్సలు వెళ్ళొద్దు.పాయి ఆయిల్ వాడకం కొలెస్టెరాల్ ని విపరీతంగా పెంచుతుంది.

* గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్కు ఉన్నా లేకున్నా, పామ్ ఆయిల్ వాడకాన్ని చాలా లిమిట్ లో పెట్టుకోవాలి.ఇందాక చెప్పినట్లుగా దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ.

కొలెస్టెరాల్ లెవల్స్ పెరగటం మీ గుండెకు అస్సలు మంచిది కాదు.గుండె సంబంధిత వ్యాధులు ఎన్నో రావొచ్చు.

* పామ్ ఆయిల్ కొవ్వుని డిపాజిట్ చేస్తుంది.మీరు పామ్ అయిల్ వాడినాకొద్దీ లావెక్కుతూనే ఉంటారు.

మిగితా ఆయిల్స్ తో పోలిస్తే పామ్ ఆయిల్ అతిసులువుగా బరువు పెంచుతుంది.ఇక్కడ బరువు కన్నా పెద్ద సమస్య కొవ్వు పెరిగిపోవటం.

* హైపర్ టెన్షన్ సమస్యలతో బాధపడేవారు కూడా పామ్ ఆయిల్ పక్కనపెట్టాలి.ఇది మీ హార్మోన్స్ ప్రొడక్షన్ లో, హార్ట్ బీట్ రేట్ లో మరిన్ని సమస్యలయ తీసుకొచ్చి హైపర్ టెన్షన్ పెంచుతుంది.

* పామ్ ఆయిల్ వాడటం వలన జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

#ఎవరు వాడవచ్చు?

* పామ్ ఆయిల్ లో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ.ఆ అవసరం ఉన్నవారు ప్రయత్నం చేయవచ్చు.

* ఇందులో విటమిన్ ఏ ఎక్కువ.

కాబట్టి కంటిచూపు సమస్యలు ఉన్నవారు డాక్టర్ ని సంప్రదించి లిమిట్ లో తీసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube