జ‌య‌ల‌లిత కోట్ల ఆస్తుల‌కు వార‌సులెవ‌రు..?

త‌మిళ ప్ర‌జ‌ల‌చేత అమ్మ‌గా పిలిపించుకున్న పురుచ్చిత‌లైవి, మాజీ సీఎం దివంగ‌త జ‌య‌ల‌లిత మ‌హాభినిష్క్ర‌మ‌ణంతో త‌మిళ‌నాడు ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌రైన ఆన్స‌ర్ లేకుండా పోయింది.త‌మిళ‌నాడు తాత్కాలిక సీఎంగా ఆమె అనుంగు అనుచ‌రుడు ప‌న్నీరు సెల్వం బాధ్య‌త‌లు చేప‌ట్టినా ఆయ‌న ఆమె స్థాయికి త‌గిన వ్య‌క్తి కాద‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి.

 Who Is The Descendants Of Jayalalitha Assets..?-TeluguStop.com

ఈ చ‌ర్చ‌లు ఇలా ఉండ‌గానే ఫ్యూచ‌ర్‌లో అన్నాడీఎంకే పార్టీ ప‌గ్గాల‌ను ఎవ‌రు చేప‌డ‌తార‌న్న‌ది కూడా ప్ర‌స్తుతానికి పెద్ద స‌స్పెన్స్‌గానే మిగిలిపోనుంది.

ఈ చ‌ర్చ‌లు ఇలా ఉండ‌గానే జ‌య‌ల‌లిత త‌న జీవితంలో సినిమా స్టార్‌గాను, సీఎంగాను సంపాదించిన కోట్లాది రూపాయ‌ల‌కు ఇప్పుడు వార‌సులు ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ లేకుండా పోయింది.జ‌య‌ల‌లిత‌కు సోద‌రుడు, బంధువులు ఉన్నా వారు ఆమెను మోసం చేయ‌డంతో వారిని ఆమె ఎప్పుడో ప‌క్క‌న పెట్టేశారు.ఇక ఆమె ఎంతో గారాబంగా పెంచుకుని, అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసిన ఆమె పెంపుడు కుమారుడు సుధాక‌ర‌న్‌తో కూడా ఆమెకు చివ‌ర్లో స‌త్సంబంధాలు లేవు.

సుధాక‌ర‌న్‌ను సైతం ఆమె ప‌క్క‌న పెట్టేశారు.

ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ ఉన్నా….జ‌య త‌ర్వాత ఆమెకు నెంబ‌ర్ 2 ఛాన్స్ లేకుండా ఆమెను కంట్రోల్ చేశారు.దీంతో జ‌యకు ఉన్న కోట్లాది రూపాయ‌ల ఆస్తులు ఇప్పుడు ఎవ‌రికి చెందుతాయ‌న్న ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ లేదు.

ఇక జ‌య‌కు సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోను కోట్లాది రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయి.హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, తిరువ‌నంత‌పురం, పుదుచ్చేరి, ఢిల్లీ ప్రాంతాల్లో వంద‌ల ఎక‌రాల్లో స్థ‌లాలు, బంగ‌ళాలు ఉన్నాయి.

వీటితో పాటు ఆమెకు ఉన్న క్యాష్‌, బంగారం, వ‌జ్రాల విలువ కోట్లలోనే ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇప్పుడు ఈ ఆస్తుల‌పైనే అంద‌రి కాన్‌సంట్రేష‌న్ ఉంది.

జ‌య అవివాహితురాలు.ఆమె బంధువులు, పెంపుడు కొడుకుల‌కు త‌న ఆస్తుల‌పై వీలునామా రాయ‌లేదు.

ఇక అవి వారికే చెందుతాయా ? లేదా ? అవి అన్నాడీఎంకే పార్టీకి చెందుతాయా ? లేదా ప్ర‌భుత్వ‌మే వాటిని స్వాధీనం చేసుకుని వాటిని నిర్వ‌హిస్తుందా ? అన్న చ‌ర్చ‌లు ఇప్పుడు త‌మిళ‌నాడులో జ‌రుగుతున్నాయి.ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ దొర‌కాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube