దాస‌రి ఉద‌యం.. నాశ‌నానికి కారుకులు వారేనా?

ద‌ర్శ‌క ర‌త్న‌గా తెర‌మీద ప‌రిచ‌యం అయిన పాల‌కొల్లు.అబ్బాయి.

 Who Is Destruction Dasari Udayam Paper-TeluguStop.com

దాస‌రి నారాయ‌ణ‌రావు.బ‌హుముఖాలుగా త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నారు.

త‌న ర‌చ‌నా నైపుణ్యంతో పాట‌లు, మాట‌లు కూడా దంచి కొట్టారు.అక్క‌డితో ఆగ‌ని ఆ క‌ళాపిపాస తృష్ణ‌.

జ‌ర్న‌లిజం వైపు కూడా సాగింది.అప్ప‌ట్లో.

నంద‌మూరి తార‌క‌రామారావు.కి దాస‌రికి మ‌ధ్య త‌లెత్తిన రాజ‌కీయ ప‌ట్టింపుల నేప‌థ్యంలో ప‌త్రికా రంగంలోకి అడుగు పెట్టిన దాస‌రి.ఉద‌యం పేరుతో విజ‌య‌వాడ కేంద్రంగా దిన‌ప‌త్రిక‌ను స్థాపించారు.

1984లో ప‌త్రికా రంగంలోకి అడుగు పెడుతూనే ఉద‌యం సంచ‌ల‌నాల‌కు వేదిక అయింది.ప్ర‌భుత్వంలోని లోపాల‌ను ఎత్తి చూప‌డ‌మే కాకుండా ప‌దునైన సంపాద‌కీయాల‌తో మాట‌ల తూటాల‌ను పేలుస్తూ.పాల‌కులకు చెమ‌ట‌లు ప‌ట్టించేంది.అదే స‌మ‌యంలో ప‌త్రికా రంగంలో గుత్తాధిప‌త్యాన్ని సైతం ప్ర‌శ్నిస్తూ.ఎడిటోరియ‌ల్ బోర్డుకు కొన్ని స్వ‌తంత్ర నిర్ణ‌యాలు తీసుకునే స్వేచ్ఛ‌ను సైతం దాస‌రి క‌ల్పించారు.

ఇక‌, అప్పుడు ఇప్పుడు స‌ర్క్యులేష‌న్‌లో ప్ర‌థ‌మంలో ఉన్న ఓ ప్ర‌తిక య‌జ‌మాని.త‌న‌కు పోటీగా ఉన్న ఉద‌యంపై క‌న్ను కుట్టింది.

దీంతో ఈ ప‌త్రిక‌ను ఎలాగైనా అణ‌గ‌దొక్కాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.దీనికి ప‌క్కా ప‌థ‌కం ఆలోచిస్తున్న క్ర‌మంలోనే దాస‌రి అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు.

ఒక ప‌క్క సినిమాలు, డైరెక్ష‌న్‌, ప్రొడ‌క్ష‌న్లు.న‌టించ‌డం, నిర్మాత‌గా బిజీగా మారిపోయారు.

దీంతో ఆయ‌న‌కు ఉద‌యం ప‌త్రిక నిర్వ‌హ‌ణ క‌త్తిమీద సాములా మారింది.దీనికితోడు ప‌ని ఒత్తిడి అధిక‌మైంది.

దీంతో త‌న స‌తీమ‌ణి ప‌ద్మ సూచ‌న‌ల మేర‌కు ప‌త్రిక‌ను అప్ప‌టి ఎంపీ మాగుంట సుబ్బ‌రామిరెడ్డికి విక్ర‌యించేశారు.

ఈ ప‌రిణామం ఆ పెద్ద ప‌త్రిక‌కు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారింది.

ఉద‌యాన్ని దెబ్బ‌తీయాలంటే.మాగుంట ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌తీయాల‌ని ఆ పెద్ద ప‌త్రిక అధినేత నిర్ణ‌యించుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే మాగుంట‌కు ఆర్థికంగా బ‌లాన్నిచ్చిన మ‌ద్యంపై క‌న్ను ప‌డింది.ఎక్క‌డో నెల్లూరులో మారుమూల దూబ‌గుంట రోశ‌మ్మ స్టార్ట్ చేసిన మ‌ద్య నిషేధ ఉద్య‌మాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని ప్ర‌చారం చేశాడు.

దీనిని ఎన్టీఆర్ త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చేర్చ‌డం త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ నెగ్గ‌డం, మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేయ‌డం జ‌ర‌గిపోయారు.దీంతో మాగుంట ఆర్థికంగా చితికిపోయి.

ఉద‌యాన్ని మూసేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది.సో.దాస‌రి ఉద‌యం మూసివేత వెనుక‌.ఆ పెద్ద ప‌త్రిక య‌జ‌మాని ఎలా చ‌క్రం తిప్పాడో.

ఇట్టే అర్ధ‌మ‌వుతోంది క‌దూ!!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube