ఖైదీనం 150 రికార్డులను కొట్టే అవకాశం ఏ హీరోకి ఉంది?

మెగాస్టార్ చిరంజీవి తాను వదిలేసిన సింహాసనంపై మళ్ళీ తానే వచ్చి కూర్చున్నారు.దాదాపుగా దశాబ్దం గ్యాప్ ఇచ్చినా, ఆయన స్థానాన్ని అందుకోలేకపోయారు మన స్టార్ హీరోలు.

 Which Star Hero Can Beat Khaidi No 150 This Year?-TeluguStop.com

మొత్తానికి వంద కోట్ల షేర్ వసూళ్ళతో బాహుబలి తరువాత అతిపెద్ద హిట్ ని సొంతం చేసుకున్నారు.మరి ఈ రికార్డులని ఈ ఏడాది తిరగరాసే అవకాశం ఏ హీరోలకి ఉందో చూద్దాం.

(బాహుబలి మినహాయించి)

* ఖైదీనం 150 తరువాత రాబోతున్న తొలి పెద్ద సినిమా కాటమరాయుడు.పవర్ స్టార్ స్టామినా, మాస్ కంటెంట్, ఉగాది పండుగ వాతావరణం, వేసవి సెలవులు .ఇంకా ఏం కావాలి? సినిమాకి మంచి టాక్ వస్తే ఖైదీ నం 150 రికార్డులను దాటే అవకాశం నిండుగా ఉంది ఈ సినిమాకి.

* అల్లు అర్జున్ నటిస్తున్న డిజే దువ్వాడ జగన్నాథం మేలో విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

సినిమా ఎలాగో మాస్ కామేడి.కాని, అల్లు అర్జున్ మార్కేట్ ఇప్పుడప్పుడే వంద కోట్లను చేరుకుంటుందా అంటే చెప్పలేం.

కాబట్టి ఈ సినిమా సరైనోడుని దాటినా దాటోచ్చు కాని, ఖైదీని టచ్ చేయడం కష్టమైన విషయమే.

* ఇక జూన్ లో వస్తున్న మహేష్ 23 రెండు భాషల్లో తెరకెక్కుతోంది.

శ్రీమంతుడు తరువాత మహేష్ ఒక యాక్షన్ చిత్రం చేస్తుండటం, మినిమమ్ గ్యారంటి సబ్జెక్టుతో వచ్చే ఏఅర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.తెలుగు – తమిళ బిజినెస్‌ 150 కోట్లకు పైగానే జరుగుతుంది కాబట్టి తెలుగు వెర్షన్ వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయాల్సిందే.

టాక్ వస్తే మహేష్ కి అదేమంత కష్టమైన విషయం కాదు.కాబట్టి ఈ చిత్రం నుంచి ఖైదీనం 150 రికార్డులకు ఆపద ఉంది.

* ఇక ఆగష్టులో ఎన్టీఆర్ – బాబి సినిమా వస్తుంది.జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్బస్టర్ ని సొంతం చేసుకున్నాక యంగ్ టైగర్ చేస్తున్న సినిమా ఇది.ఈసారి కొరటాల శివ బ్రాండ్ ఇమేజ్ లేకపోవడంతో, యంగ్ టైగర్ ఒక్కడే సినిమా కలెక్షన్లు లాగాలి.టాక్ వస్తే 80 కోట్లు ఈజీ.అలాగని వంద కోట్ల సంపాదించే అవకాశాలను కాదనలేం.సో, ఈ సినిమా కూడా ఖైదీనం 150 రికార్డుల మీద కన్నేసిందనే చెప్పాలి.

* ఇక ఏడాది చివర్లో రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ఉంది.అన్నీ వర్గాల వారిని సుకుమార్ సినిమాతో అలరించటం కొంచెం కష్టమైన విషయమే.పైగా రామ్ చరణ్ లో మునుపటి దూకుడు లేదు.ఈ సినిమా 70-80 కోట్ల వసూళ్ళు రాబడితే చాలా బాగా కలెక్ట్ చేసినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube