కంట్లో దుమ్ము పడితే బయటకి తీయాల్సిన కరెక్ట్ పధ్ధతి ఇది

మన కళ్ళు చాలా సున్నితమైనవి.ఏ చిన్న దాడిని కూడా తట్టుకోలేవు.

 Which Is The Most Healthiest Way To Clean Dirt From Your Eyes ?-TeluguStop.com

అందుకే కనులకి దాడిని అడ్డుకునే శక్తిని ఇచ్చాడు దేవుడు.మీరు గమనించే ఉంటారు … మీ కంటివైపు ఏదైనా వస్తోందంటే మీ కనులు దానికవే మూసుకుపోతాయి.

మిగితా శరీరభాగాలు దాడిని ఆలస్యంగా గుర్తిస్తాయేమో కాని కనులు మాత్రం అప్పటికప్పుడు మూసుకుపోతాయి.కాని ఒక్కోసారి దురదృష్టం కొద్ది మనం రెప్ప మూసేలోపే ప్రమాదం కనుల లోపలి వెళ్ళిపోతుంది.

అంటే దుమ్ము, ధూళి లేదా ఏదైనా పురుగు కనుల లోపలికి వెళ్ళిపోతుంది.అప్పుడు మనలో చాలామంది వెంటనే చేసే పని కనులని నలవడం.

కాని అలా చేయకూడదు.మీ చేతి వేలితో కూడా దుమ్ముని తీయడానికి ప్రయత్నించకూడదు.

ఈ రెండిట్లో ఏం మీ కనులకి అయితే గాయం చేస్తారు లేదంటే ఇన్ఫెక్షన్ అంటిస్తారు.మరి కరెక్టు పధ్ధతి ఏమిటి ?

మొదటగా, కంటిలో ఏమైనా పడితే రెండు మూడు సార్లు రెప్ప వేయండి.మన కంటిలో ఉండే ద్రవం కంటిని శుభ్రపరుస్తూ దాన్ని బయటకి తీసే అవకాశం ఉంటుంది.ఒకవేళ ఆలా రాకపోతే మాత్రం మీ చేతులతో కంటిలో పెట్టొద్దు.బకిట్లో నీళ్ళు తీసుకొని దాంట్లో తల మాత్రమె ముంచండి.ఇప్పుడు నీటి లోపల రెప్పలను ఆడించండి.

ఆ దుమ్ము లేదా పురుగు నీటిలోకి వెళ్ళిపోతుంది.బకిట్ అందుబాటులో లేకపోయినా ఫర్వాలేదు, చేతిలో నీళ్ళు పోసుకొని, మీ కనురెప్పలను ఆ నీటిలో ఆడించండి.

దుమ్ము, ధూళి, పురుగు ఏదైనా సరే బయటకి వస్తుంది.

ఈ రెండు కాకపోతే స్వచ్చమైన కాటన్ తీసుకొని మెల్లిగా, అద్దంలో చూసుకుంటూ దుమ్ముని బయటకి తీయండి.

కాని కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి.అసలే కనులు చాలా సున్నితం.

రెండిట్లో ఈ పధ్ధతి ప్రయోగించినా, దుమ్ము ధూళి బయటకి వచ్చిన తరువాత మీ కనులని నీటిలో ఆడించండి.దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

అంతేతప్ప సున్నితమైన కనులపై, చాలా సున్నితమైన కంటి కింది చర్మంపై బలప్రయోగం చేయొద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube