నీవెప్పుడు సీఎం అవుతావు?

ప్రశ్నిస్తాను అంటూ పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్‌కు పీపుల్స్‌ స్టార్‌ అయిన ఆర్‌.నారాయణ మూర్తి నుండి సూటి ప్రశ్న ఎదురైంది.

 When You Will Become Cm Pawan? Asks Rnr-TeluguStop.com

‘పవన్‌ కళ్యాణ్‌ నువ్వు సీఎం ఎప్పుడు అవుతావు?’ అంటూ తాజాగా జరిగిన ‘రేయ్‌’ పవనిజం సాంగ్‌ విడుదల కార్యక్రమంలో నారాయణ మూర్తి ప్రశ్నించాడు.పవన్‌ కళ్యాణ్‌ అంటే అందరికి అభిమానం అని, ఆయన వ్యక్తిత్వం, ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే తప్పన ఆయనలో ఎక్కువగా ఉంటుంది కనుక ఆయన్ను ఇష్టపడని వారు ఉండరు అని, ఆయన అంటే తనకు చాలా అభిమానం అంటూ నారాయణ మూర్తి చెప్పుకొచ్చాడు.

అందరికి ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది.కాని అందరు పార్టీ పెట్టరు.కాని పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పెట్టాడు.ఆయన ముఖ్యమంత్రి కావాలని అంతా కోరుకుంటున్నారు.

అంతా కోరుకున్నట్లుగా పవన్‌ ముఖ్యమంత్రి కావాలి.ఆయన సేవ ప్రజలకు తప్పని సరిగా అవసరం.

ఆయన కోట్లాది మంది అభిమానులు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడా అని ఎదురు చూస్తున్నారు అన్నాడు.నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలను పవన్‌ కళ్యాణ్‌ ఎలా స్పీకరిస్తాడు అనేది చూడాలి.

పవన్‌ కళ్యాణ్‌కు సీఎం అవ్వాలనే ఆలోచన ఏ కోశాన లేదని, ఆయన కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే పార్టీని స్థాపించాడని పవన్‌ అభిమానులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube