భోజనం తరువాత నీటిని ఎలా త్రాగాలి..

నీళ్ళు త్రాగడం.మంచి నీళ్ళు త్రాగడం రెండిటికి చాలా తేడా ఉంది.

 When Is The Best Time To Drink Water-TeluguStop.com

పూర్వం కాలువల్లో ప్రవహించే నీటిని ఒడిసిపట్టి త్రాగే వాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు.బావులలో ఉండే నీళ్ళు సైతం కాలుష్యం అవుతున్నాయి.

ఈ సమయంలో నీటిని త్రాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు అనేకం ఉత్పన్నమవుతాయి.అలాగే నీటిని తగినంతగా తాగకపోయినా కూడా అనేక రకాల సమస్యలు వస్తాయి

ఆరోగ్యానికి మంచి నీరు త్రాగడం చాలా మంచిది.

కాచి చల్లార్చిన నీటిని త్రాగితే వాటిలో ఉండే క్రిములు నశిస్తాయి.ఈ విషయం అందరికి తెలిసినదే కానీ మనం త్రాగే నీటిలో కొంచం తులసి ఆకులు నులిమి వేయడం వలన తులసిలో ఉండే గుణాలు నీటిని శుద్ది చేస్తాయి.

ఇప్పడు చాలా మంది ఎదుర్కునే సమస్య ఒక్కటే నీటిని సరిగా త్రాగాక పోవడం

చాలా మంది నీరు ఎక్కువ సేవించకపోవడం వల్ల అనేకమైన అనారోగ్య సమస్యలకి లోనవుతుంటారు.ముఖ్యంగా ఎక్కువగా శ్రమించే వాళ్ళు .పని ఎక్కువగా చేసేవాళ్ళు శరీరంలో నీటి స్థాయి చెమట రూపంలో బయటకి పోతుంది.పని వత్తిడిలో వీరు నీటిని తీసుకోరు ఇలాంటివాళ్ళు ఎక్కువగా డీ హైడ్రేషన్ తో బాధ పడుతుంటారు.

అంతేకాదు కిడ్నీ లో రాళ్ళు ఏర్పడటానికి ప్రధానమైన కారణం నీళ్ళని శరీరానికి సరిపడా త్రాగాకపోవడమే.

మరి నీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలి.అంటే

పరగడుపున లేవగానే రెండు లీటర్ల నీటిని తప్పకుండ త్రాగాలి అని వైద్యులు చెప్తున్నారు.అంతేకాదు

నీటిని త్రాగే క్రమం లో ఒకేసారి గడగడ త్రాగాకూడదు కొంచం కొంచం గా త్రాగితే అవి సరైన స్థాయిలో శరీరానికి చేరుతాయి

ఉదయం నీరు తాగిన అనంతరం 25,30 నిమిషాల గ్యాప్ ఇచ్చి ఏదనా టిఫిన్ తినాల్సి ఉంటుంది.

ఇక టిఫిన్ తినే సమయంలో నీరు తీసుకపోవడమే మంచిది

మాత్రలు వేసుకున్నప్పుడు తగినంత నీటిని త్రాగాలి చాలా మంది కొంచం నీటిని తాగుతారు అలా చేయకూడదు ఎందుకంటే మాత్ర కరిగే నీటిని మనం శరీరానికి ఇవ్వాలి అప్పుడే మాత్ర కరుగుతుంది లేకపోతే సంపూర్తిగా కరగక సైడ్ ఎఫెక్ట్స్ కి దారి తీస్తుంది

భోజనం చేసే ముందు నీటిని అస్సలు తాగకూడదు ,భోజనం చేసేటప్పుడు త్రాగాకూడదు.గొంతు సవరించడానికి మాత్రం ఒక గుటక నీటిని తాగవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube