పెద్ద షాక్ ఇచ్చిన వాట్సాప్

ప్రపంచంలోనే అతిపెద్ద మెసెంజర్ యాప్ అయిన వాట్సాప్ ని సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ $21.8 బిలియన్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఫేస్ బుక్, తన చేతిలో ఉన్న వాట్సాప్ తన లాభం కోసం వాడుకోబోతోంది.ఇకనుంచి మీ వాట్సాప్ నంబర్ ఫేస్ బుక్ దగ్గర ఉంటుంది.

 Whatsapp Will Share User Number To Facebook-TeluguStop.com

నమ్మాలనిపించకపోతే ఓసారి వాట్సాప్ ఓపెన్ చేయండి.ఈ విషయమై ఈపాటికే మీకో మెసెజ్ వచ్చే ఉంటుంది.

అయితే మీ వాట్సాప్ నంబర్ ని ఫేస్ బుక్ తనవద్దే దాచుకుంటుందట.పబ్లిక్ లో డిస్ప్లే చేయడం కాని, మీ వాట్సాప్ మెసెజ్ లను ఫేస్ బుక్ కి సింక్ చేయడం కాని జరగదు అని ఫేస్ బుక్ ప్రకటించింది.

మరి మన వాట్సాప్ నంబర్ ఫెస్ బుక్ కి ఎందుకు? దాని అవసరం ఏంటి ?

ఫేస్ బుక్ యాడ్స్ ని మనకు మరింత ఉపయోగకరంగా మార్చేందుకు ఈ పని చేస్తున్నారట.దీన్ని టార్గెటెడ్ అడ్వర్టయిజింగ్ అని అంటారు.

అంటే మనకు అనవసరమైన యాడ్స్ ఫేస్ బుక్ లో కనిపించకుండా చేయడం.అలాగే కొన్నిరకాల ట్రాన్సాక్షన్స్ (ఆర్డర్, డెలివరి) లాంటివి కుడా వాట్సాప్ ద్వారా జరగనున్నాయి.

మీకు ఇంటరెస్ట్ ఉన్న ప్రాడక్ట్ యొక్క ఆఫర్స్ గురించి కూడా మీకు మెసెజ్ లు రావొచ్చు.అయితే వాట్సాప్ వినియోగదార్లకు ఇబ్బంది కలిగేలా స్పామ్ మాత్రం ఉండదని ఫేస్ బుక్ చెబుతోంది.

ఇక గుడ్డిలో మెల్ల నయం అన్నట్లు .థర్డ్ పార్టీ బ్యానర్ యాడ్స్ మాత్రం ఇప్పుడు కూడా ఉండవంట.ఇక చివరగా చెప్పేదేంటే ….మీ వాట్సాప్ నంబర్ వివరాలు ఫేస్ బుక్ దగ్గర ఉంచడం, ఉంచకపోవడం మీ ఇష్టం.కాని ఒక్కసారి మీరు మీ వివరాలు షేర్ చేయడం ఇష్టం లేక Whatsapp > Settings > Account లోకి వెళ్లి “SHARE MY ACCOUNT INFO” ఆప్షన్ ని ఆఫ్ చేస్తే, మళ్ళీ భవిష్యత్తులో ఈ సెట్టింగ్ మార్చడం జరగదు అని వాట్సాప్ చెబుతోంది.ఏం చేస్తాం .వాట్సాప్ వాడటం మనకు అత్యవసరం .వారికేమో లాభాలు అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube