పెద్ద బాంబు పెల్చబోతున్న వాట్సాప్ ?

మీ దగ్గర ఉన్న సరికొత్త స్మార్ట్ ఫోన్ లోనే కాదు, ఎప్పుడో ఏళ్ల క్రితం నాటి పాత ఫోన్లో కూడా వాట్సాప్ పనికివస్తోంది కదా.పాత అండ్రాయిడ్ iOS యూజర్లకి తన సేవలు ఇప్పటికి అందిస్తున్న వాట్సాప్ ఇకపై ఆ పని చేయకపవచ్చు.

 Whatsapp To Turn Unavailable For Old Android And Ios Mobiles ?-TeluguStop.com

సింపుల్ గా చెప్పాలంటే, పాత ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న మొబైల్స్ లో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ పనిచేయకపోవచ్చు.

మొబైల్ టెక్ నిపుణుల కథనాల ప్రకారం, వాట్సాప్ ఇక పాత ఫోన్లకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉంది.

ఇలా ఎందుకు అనే కదా మీ డౌట్.వాట్సాప్ వచ్చే ఏడాది ప్లాన్ చేస్తున్న కొత్త అప్డేట్స్ పాత మోడల్స్ లో సపోర్ట్ చేయడం కష్టం అంట.వాటి కోసం యాప్ ని డెవలప్ చేసే ఆలచన మానుకునే బదులు, కఠిన నిర్ణయం తీసుకొని పాత మోడల్స్ కి సేవలు అందించడం మానేసి, కొత్త ప్రపంచంతో ఎదగడమే మేలని తలుస్తోందట వాట్సాప్ యాజమాన్యం.

అండ్రాయిడ్ వెర్షన్ 2.1 లేదా 2.2 వాడుతున్న వారు ఇకపై వాట్సాప్ వాడటం కష్టం అని అనుకోవచ్చు.అలాగే iOS 6 దాటని మొబైల్ ఫోన్లు, 3GS డివైజ్ లలలో కూడా వాట్సాప్ పనిచేయకపోవచ్చు.దీంతో బ్లాక్ బెర్రీ, నోకియా ఫోన్స్ వాడుతున్న(కొన్ని మోడల్స్) చాలామంది వాట్సాప్ ఉపయోగించే అవకాశాన్ని కోల్పోవడం ఖాయమని టెక్ టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube