వాట్సాప్ లోకి సంచలన అప్డేట్

సోషల్ మీడియా అకౌంట్ కి అఫీషియల్ టిక్ మార్క్ అనేది ట్విట్టర్ మొదలుపెట్టింది.అంటే సినిమా, రాజకీయ, క్రీడ రంగాల్లో పెద్ద పెద్ద మనుషుల అసలు అకౌంట్ ఎదో ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా, వారికి చిన్న ప్రాసెస్ ద్వారా బ్లూ టిక్ ఆప్షన్ ఇవ్వడం మొదలుపెట్టింది ట్విట్టర్.

 Whatsapp To Get Verified Accounts Update-TeluguStop.com

అంటే అది వారి అఫీషియల్ అకౌంట్ అని అర్థమయ్యేలా చెప్పడం.కంపెనీలు, ప్రభుత్వ అకౌంట్స్, ఇలా అన్ని అఫీషియల్ ఎకౌంట్స్ కి ట్విట్టర్ బ్లూ టిక్ ఇచ్చారు.

ఇక గత ఏడాది ఆ బ్లూ టిక్ ఆప్షన్ ను సాధారణ జనాలకి కూడా విడుదల చేసింది ట్విట్టర్.అయితే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది.

మన ట్విట్టర్ అకౌంట్ లో ఎలాంటి ముద్దు పేర్లు గాట్రా వాడకూడదు కూడా.

ఈ ఆప్షన్ కి కాపి కొట్టింది ఫేస్ బుక్.

ఇక ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో కూడా బ్లూ టిక్స్ కనిపించాయి.ఆఫీషియల్ ఫేస్ బుక్ పేజిలకు, సెలబ్రిటిలకు బ్లూ టిక్స్ ఇచ్చింది ఫేస్ బుక్.

మెల్లిగా మిగితా సైట్స్ కూడా ట్విట్టర్ ని కాపి కొట్టేసాయి.ఆ తరువాత ఇంస్టాగ్రామ్ లో కూడా ఆఫిశియాల్ అకౌంట్ కి సూచనగా బ్లూ టిక్ ప్రొఫైల్స్ మొదలయ్యాయి.

అయితే ఇలాంటి ఆప్షన్ కేవలం సోషల్ మీడియా సైట్స్ లోనే తప్పా, ఆన్లైన్ మెసేజింగ్ లో ఇప్పటివరకు రాలేదు.తోలిసాటి ఓ మెసెంజర్ వెరిఫైడ్ సింబల్ ని అందించబోతోంది.

అది కూడా ఎవరో కాదు, మెసేజింగ్ ప్రపంచం అగ్రగ్రామి వాట్సాప్.

వాట్సాప్ లో కూడా ఫేక్ అకౌంట్స్ ఎక్కువ అయిపోయాయి.

ఎవరిదో ప్రొఫైల్ పిక్ పెట్టి, ఎవరో మాట్లాడడం ఇక్కడ కూడా కామన్ అయిపొయింది.వాట్సాప్ లో బిజినెస్ వ్యవహారాల గురించి కూడా చర్చిస్తారు.

అలాంటప్పుడు మోసాలు జరిగే అవకాశం ఉంది కదా.అందుకే వాట్సాప్ ఓ సంచలన అప్డేట్ తో రాబోతోంది.

మరికొన్ని రోజుల తరువాత వాట్సాప్ లో కూడా వెరిఫైడ్ అకౌంట్స్ ఉంటాయి.కాని ఇక్కడ ఉండే బ్లూ కలర్ మార్క్ కాదు.గ్రీన్ కలర్ మార్క్.అలాగే ఓ పెద్ద బిజినెస్ వారి నంబర్ తో చాట్ చేస్తున్నప్పుడు, ఆ మెసేజ్ లని ఎల్లో కలర్ లో చూపెట్టే ప్రయత్నంలో ఉంది వాట్సాప్.

అంటే ఆ మెసేజ్లను డిలీట్ చేయలేరు అన్నమాట.అలా చేస్తే మోసాలు తగ్గిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube