ఇండియాలో వాట్సాప్ బ్యాన్ కి అవకాశం? చాలా పెద్ద కారణం

మీకు గుర్తు ఉండే ఉంటుంది.కొన్ని నెలల ముందు వాట్సాప్ లోకి End-to-End Encryption అనే అప్డేట్ వచ్చింది.

 Whatsapp Could Face A Ban In India .. Know Why?-TeluguStop.com

ఈ ఆప్డేట్ అందించిన వసతి ఏమిటంటే, ఒకవేళ మీరు, మీ స్నేహితుడు, ఇద్దరు మీ చాట్ ని గనుక ఎన్క్రిప్ట్ చేసుకుంటే, ఎవరు కూడా మీ ఇద్దరి మధ్య జరిగిన చాట్ ని ట్రాక్ చేయలేరు, డీక్రిప్ట్ చేయలేరు.ఎవరు చేయలేరు అంటే ప్రభుత్వ సంస్థలు, పోలీసులు చివరికి వాట్సాప్ కూడా ఈ సందేశాలని డీక్రిప్ట్ చేయలేదు.

అంటే మీరేం చాట్ చేసుకున్నారో మీ ఇద్దరికి తప్ప, ఇంకెవరికి తెలిసే అవకాశమే లేదన్నమాట.ఈ అప్డేట్ టెక్ విశ్లేషకులకి విపరీతంగా నచ్చేసింది.

అందరు వాట్సాప్ అందిస్తున్న సెక్యూరిటి మోద ప్రశంసల జల్లు కురిపించారు.కాని ఇప్పుడు ఇదే సెక్యూరిటీ అప్డేట్ వాట్సాప్ ని చిక్కుల్లో పడేసింది.

విషయంలోకి వెళితే, ఇటీవలే లండన్ పార్లమెంటుపై తీవ్రవాదులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే.ఈ దాడుల కోసం తీవ్రవాదులు సమాచారాన్ని వాట్సాప్ ద్వారానే షేర్ చేసుకున్నారని లండన్ హోం మినిస్ట్రీ భావిస్తోంది.

దీంతో దాడికి ముందు తీవ్రవాదులు మధ్య జరిగిన చాట్ ని డిక్రిప్ట్ చేసి తమకి రిపోర్ట్ చేయాలని వాట్సాప్ ని ఆదేశించారు పోలీసులు.కాని వాట్సాప్ చేతులెత్తేసింది.

ఎందుకంటే తీవ్రవాదులు తమ వాట్సాప్ అకౌంట్స్ ని End-to-End Encryption చేసుకున్నారు.వారి మధ్య జరిగిన సంభాషణని తాము బయటపెట్టే అవకాశం లేదు అని వాట్సాప్ వివరణ ఇచ్చింది.

దాంతో లండన్ హోం శాఖ వాట్సాప్ పై మండిపడుతోంది.ఇలాంటి పనికిమాలిన అప్డేట్ ఎలా ఇస్తారు అంటూ వాట్సాప్ ప్రస్తుత ఓనర్ మార్క్ జూకర్ బర్గ్ ని వివరణ అడిగింది.

కుదిరితే వాట్సాప్ ని ఇంగ్లండు నుంచి బ్యాన్ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు టాక్.

ఇదిలా ఉంటే, ఈ అప్డేట్ భారత్ కి మరిన్ని చిక్కులు తీసుకురావచ్చు అని భారత ఇంటలిజేన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయట.

లండన్ తో పోల్చుకుంటే, భారత్ తీవ్రవాదులకి మరింత పెద్ద టార్గెట్‌.వారు ఇలా ప్రతీ సమాచారాన్ని వాట్సాప్ లోనే షేర్ చేసుకుంటే, వారిని ట్రాక్ చేయడం కుదరదు, దాంతో దాడులు పసిగట్టడం కష్టమైపోతుంది.

కనిపెట్టలేకపోతే, వాటిని ఆపడం కూడా కష్టమైపోతుంది.ఇలాంటి సందర్భంలో, కేవలం లండన్ మాత్రమే కాదు, భారత్ కూడా వాట్సాప్ యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలని, వెంటనే End-to-End Encryption తొలగించేలా ఒత్తిడి తేవాలనే, లేదంటే బ్యాన్ చేస్తామంటూ బెదిరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube