చూపిస్తే తప్పు ఏంటి అంటున్న రష్మీ

టీవి తెరకి గ్లామర్ అద్దిన యాంకర్లు రష్మీ, అనసూయ.అయితే అనసూయ కొన్ని లిమిట్స్ పెట్టుకుంటే, రష్మీ మాత్రం తనపై పెద్దగా ఆంక్షలు విధించుకోకుండా ఇటు టీవీతెరపై, అటు పెద్ద్ తెరపై గ్లామర్ ఒలకబోస్తోంది.

 What’s Wrong In Skin Show .. Asks Anchor Rashmi-TeluguStop.com

ఈ గ్లామర్ షోతో టీఆర్పీ బాగా పెరగటం వలన ఛానెల్స్ ఈ యాంకర్ కి పెద్ద మొత్తమే అందజేస్తున్నాయి.అయితే టీవిలో ఈ కొత్త పద్ధతులని కుర్రకారు ఎంజాయ్ చేస్తోంటే, మరికొంతమంది మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు.

కుటుంబం అంతా కలిసి కూర్చోనే టీవి ముందు ఈ స్కిన్ షో ఏంటి అని కామెంట్స్ ఎక్కుపెడుతున్నారు.

అయితే రష్మీ మాత్రం ఈ కామెంట్స్ ని బేఖాతరు చేస్తోంది.

చూపిస్తే తప్పేంటి అంటూ ఎదురుప్రశ్నిస్తోంది.సినిమాలు కూడా టీవిలో వస్తాయి కదా, అందులో హీరోయిన్లు బికినీ వేసుకున్నా, ఎంత చిన్న బట్టలు వేసుకున్నా ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు కాని, టీవి యాంకర్ కొంచెం గ్లామరస్ గా కనిపించినా ఎక్కడలేని నీతులు మాట్లాడుతారు అంటూ విమర్శలను తిప్పికొడుతోంది.

జబర్దస్త్ చాలా పాపులర్ షో.ఈ షోని తెలుగు రాష్ట్రాల్లో లక్షలమంది చూస్తారు.షో ఇంత పాపులర్ కావడానికి రష్మీ కూడా ఓ కారణం.ఫ్రాంక్ గా చెప్పాలంటే, రష్మీ గ్లామర్ కూడా ఓ కారణం.మరి షో రోజూ చూస్తూ, రష్మీ గ్లామర్ వైపు కూడా ఓ కన్నేస్తూ, మళ్ళీ బయటకి మాత్రం ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ అంటారా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube