ఎప్రిల్ 29 .ఇదీ ముందునుంచి బ్రహ్మోత్సవం విడుదల తేదిగా చెబుతున్న రోజు.
కాని నిజంగానే ఎప్రిల్ బరిలో సూపర్ స్టార్ ఆండ్ టీమ్ ఉన్నారా అంటే, ఖచ్చతంగా చెప్పలేని పరిస్థితి.మార్చిలో పూర్తయిపోతుంది .కంగారు లేదు .ఎప్రిల్ కి వస్తున్నాం అని మహేష్ అభిమానులు ఢంకా బజాయిస్తోంటే .ఇప్పటికి అనుమానమే .షూటింగ్ లో ఆలస్యం జరగడం ఖాయం అని ఫిలింనగర్ ప్రజలు నొక్కి చెబుతున్నారు.
ఈ కన్ప్యూజన్ కి కారణం బ్రహ్మోత్సవం తారాగణం.ఉన్న ముగ్గురు హీరోయిన్లు, అగ్రశ్రేణి క్యారెక్టర్ ఆర్టిస్టులు .అందరూ బిజి బిజి జనాలే.ఒక్కరి డేట్ అదుపు తప్పినా, షూటింగ్ స్పీడ్ ఓ రేంజ్ లో దెబ్బతింటుంది.
మే, జులై అంటూ రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.
నిర్మాత డబ్బులు లేవని ఒకరంటే, షూటింగ్ పూర్తయ్యేవరకే ఎప్రిల్ అయిపోతుందని మరికొందరు అంటున్నారు.
కాస్త వీటికి సమాధానం చెప్పండి అని నిర్మాతలను ఎంత అడిగినా, వారినుంచి సమాధానం లేదు.ఇంతకి బ్రహ్మోత్సవం చెప్పిన టైమ్ కి వస్తుందా రాదా? అంతా అయోమయం.