ఎన్టీఆర్ దారి ఎటువైపు?

నిక్కర్లేసుకునే వయసులోనే రికార్డులు కొట్టాడు, ఇదీ, తరచుగా ఎన్టీఆర్‌ గురించి మనం వినే మాట.అసలు అంత చిన్న వయసులో మాస్ ఫాలోయింగ్ సంపాదించడం ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే చెల్లింది.

 What’s Cooking In Ntr Mind ?-TeluguStop.com

ఆది, సింహాద్రి మాస్ చేత ఈలలు వేయించాయి.ఎన్టీఆర్ అంటే మాస్, తొడలు కొడతాడు, పెద్ద పెద్ద డైలాగులు చెబుతాడు, పగవాళ్ళని పౌరుషంతో నరికేస్తాడు.

వయసుకి తగ్గట్టుగా కాకుండా చాలా బరువైన పాత్రలు పోషించాడు మన యంగ్ టైగర్.ఆ మాస్ ఇమేజే రాను రాను బరువుగా మారింది.

అన్ని సినిమాలు ఒకే పద్ధతిలో చేసుకుంటూపోయాడు ఎన్టీఆర్.క్లాస్ ప్రేక్షకులకి, యూత్ ఆడియెన్స్ కి క్రమంగా దూరమవుతూపోయాడు.అటువైపు మహేష్, పవన్, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూపోయారు.మాస్ సినిమాలు తీస్తూనే, ఫ్యామిలి ప్రేక్షకులని, యూత్ ని దృష్టిలో పెట్టుకోని సినిమాలు తీసారు.

బాద్షా మురిపించింది.రికార్డులు కొట్టేలానే కనిపించింది.ఏమైందో తెలియదు.50 కోట్ల సినిమా కాలేకపోయింది.ఏం చేస్తే ఎన్టీఆర్‌ అనుకున్న హిట్ కొడతాడు.రామయ్య వస్తావయ్య, రభస .మళ్ళీ మాస్ జపమే.ఫలితాలు కూడా అంతతమాత్రమే.

సుకుమార్ తో సినిమా అనగానే అంతా పెదవి విరిచారు.మాస్ హీరోకి, క్లాస్ డైరెక్టర్ కి ఎట్లా సెట్ అవుద్ది అన్నారు.కట్ చేస్తే నాన్నాకు ప్రేమతో ఎన్టీఆర్ మాస్ సినిమాల కన్నా బాగా ఆడుతోంది.ఈ ఊపు మరోవారం కొనసాగితే ఎన్టీఆర్ కి తొలి 50 కోట్ల చిత్రం అవబోతోంది.

ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది.ఇకనుంచి ఎన్టీఆర్ దారి ఎటువైపు? అపుడెప్పుడో రికార్డులు ఇచ్చిన మాస్ సినిమాల వైపా? లేక తన మార్కేట్ ని పెంచిన నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల వైపా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube