శృతిని వాళ్ళు కిడ్నాప్ చేయాలి అనుకున్నారు .. బయటపెట్టిన కమల్

ధనం మూలం ఇదం జగత్ అన్నారు.ధనం మీదే నడుస్తోంది ఈ ప్రపంచం.

 What? Shruti Was About To Get Kidnapped .. Reveals Kamal Haasan-TeluguStop.com

డబ్బు మనిషితో ఎలాంటి పని అయినా చేయించగలదు.చివరకి కమల్ హాసన్ లాంటి హై ప్రొఫైల్ మనిషి కూతురిని కూడా కిడ్నాప్ చేయాలనే ఆలోచన పుట్టే ధైర్యం నింపగలదు.

శృతి హాసన్ కిడ్నాప్ ఏంటి … బాగానే ఉంది, పెద్ద సినిమాలే చేస్తోంది కదా.శృతి కిడ్నాప్ కి గురవ్వలేదు.కాని అయ్యుండేది.ఏంటి నిజంగానే అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, స్వయంగా కమల్ హాసన్ బయటపెట్టిన నిజం.

1994వ సంవత్సరం, అంటే అప్పుడు శృతి వయసు 8 ఏళ్ళు.ఆ సమయంలో కమల్ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళే శృతిని కిడ్నాప్ చేయాలని మూకుమ్మడిగా ప్లాన్ చేసారట.ఎందుకోసం? కమల్ మీద కోపం కానే కాదు.డబ్బు కోసమే.

ఎలాగో అందరికి ఇంట్లోకి వెళ్ళే వీలు ఉంటుంది, కిడ్నాప్ చేసి బయటి వ్యక్తీ ఎవరో కిడ్నాప్ చేసినట్టు సీన్ క్రియేట్ చేసి డబ్బులు గుంజాలి అనుకున్నారట.కాని ఈ విషయం కమల్ కి తెలిసిపోయింది.

అప్పుడు కమల్ కి ఎంత కోపం వచ్చిందట అంటే, తన బిడ్డను కాపాడుకోవడానికి వారి ప్రాణాలు తీయాడానికి కూడా సిద్ధపడ్డాడట.కాని అదృష్టవశాత్తు భావోద్వేగంలో అంత దూరం వెళ్ళకుండానే హ్యాండిల్ చేసాడు పరిస్థితిని.

కమల్ ఈ సంఘటనను ఎలా మరియు ఎందుకు బయటపెట్టాడు అంటే ఆ సమయంలో మహానది అనే స్క్రిప్టు రాసుకుంటున్నాడు కమల్.ఈ విషయం తెలిసిన తరువాత, సమస్య పరిష్కారం అయిన తరువాత కూడా ఓ నెలరోజుల నుంచి ఆ భయం నుంచి బయటకి రాలేకపోయాడట కమల్.

తనకు ఇష్టమైన 70 సినిమాల గురించి మాట్లాడుతూ, ఆ సినిమా టాపిక్ రాగానే ఈ చేదు జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నాడు కమల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube