ఆయుర్వేదం ప్రకారం మంచినీళ్ళు తాగాల్సిన కరెక్టు పద్ధతి ఇది

మంచినీళ్ళు బాగా తాగాలని మనకు తెలుసు.మగవారైతే రోజుకి మూడున్న లీటర్ల, ఆడవారైతే రెండున్నర నుంచి మూడు లీటర్లు (పనిచేసే విధానాన్ని బట్టి) తాగాలని కూడా తెలుసు.

 What Is The Correct Way Of Drinking Water?-TeluguStop.com

ఈ ఎండకాలంలో అయితే నీళ్ళు ఖచ్చితంగా తాగాలని, లేదంటే చెమట అయిపోయి వడదెబ్బ తగులుతుందని కూడా బాగా తెలుసు.కాని నీళ్ళు ఎలా తాగాలో తెలుసా ? ఎలగైతే భోజనాన్ని ఎలా పడితే అలా, ఇష్టం వచ్చినట్టు తినమో, మంచినీళ్ళను కూడా ఎలా పడితే అలా తాగకూడదు.మంచినీళ్ళ నుంచి అన్నిరకాల లాభాలు పొందాలంటే, ఓ పద్ధతిలో తాగాలి.ఆయిర్వేదం చెబుతున్న ఆ పద్ధతి ఏమిటో చూడండి మరి.

* నీళ్ళు కూర్చోని తాగాలి.నిలబడి కాదు.

ఇదే పద్ధతిని ఇస్లాంలో కూడా ఉండటం విశేషం.
* మంచినీళ్ళు నెమ్మదిగా తాగాలి.

ఒకే పట్టులో గటుక్కు గుటుక్కుమంటూ ఆదరాబాదరగా తాగకూడదు.

* సాధ్యమైనంతవరకు గోరువెచ్చని నీటిని తాగాలి.

దంతాలను దెబ్బతీసే చన్నీళ్ళు కాదు తాగాల్సింది.

* దాహం వేసినప్పుడే నీళ్ళు తాగాలి.

ఇలా చేయడం వలన ఒంట్లో నీటి శాతం బ్యాలెన్స్‌ తప్పదు.కొందరు హద్దులు మీరి మరి తాగుతారు.

* మీరు నీళ్ళు కరెక్టుగా, సరైన మొతాదులో తీసుకుంటే మీ మూత్రం యొక్క రంగు స్వచ్ఛంగా ఉంటుంది.అలా కాకుండా పసుపు రంగులో వస్తే మీరు సరిగా నీళ్ళు తాగట్లేదని అర్థం.

మీరు డిహైడ్రేట్ అయ్యి ఉన్నారు.

* పెదాలు ఎండిపోతే కూడా మీరు నీళ్ళు తక్కువగా తాగుతున్నారని అర్థం.

* పై రెండు సందర్భాలలో నీటి కొరతని అర్థం చేసుకోని నీళ్ళు బాగా తాగాలి.అలాగే ఉదయాన్నే నీళ్ళు తాగాలి.

* భోజనానికి అరగంట నుంచి గంట ముందు నీళ్ళు తాగాలి.అలాగే భోజనం పూర్తయిన తరువాత ఇదే గ్యాప్ మేయింటేన్ చేయాలి.

భోజనం చేస్తుండగా ఎక్కువ నీరు తాగకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube