రుద్రమదేవి బడ్జెట్ ఎంత ?

కొందరు దర్శకులు కేవలం డబ్బుల కోసం సినిమాలు తీయరు .వాళ్లకి ఇంకేదో కావాలి, ఇది మనసుకి సంబంధించిన విషయం.

 What Is Rudramadevi’s Budget ?-TeluguStop.com

చూడాలనివుంది,ఒక్కడు లాంటి కమర్షియల్ కళాఖండాలు తీసిన గుణశేఖర్ కావాలనుకుంటే మళ్ళి మాంచి మాస్ సినిమాతో రావొచ్చు.కాని మరుగున పడిన చారిత్రక సంపదను తిరిగి ఈ జెనరేషన్ కు పరిచయం చేసే పనిలో పడ్డాడు.

అందుకోసం ఉన్నదంతా పెట్టడమే కాకుండా, లేని అప్పులు కూడా తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు.

ఇంతకీ రుద్రమదేవి బడ్జెట్ ఎంత ? అక్షరాలా 80 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాల మాట.ఎక్కడ రాజీ పడకుండా, ఏమాత్రం అధైర్యపడకుండా దీన్ని ఓ శిల్పిలా చెక్కాడు గుణశేఖర్.మరి సినిమా లాభాలు తెచ్చిపెడుతుందా అంటే చెప్పలేం.

బాహుబలి లాగా హాలివుడ్ రేంజ్ గ్రాఫిక్స్ లేవు, రాజమౌళి లాంటి పాపులర్ దర్శకుడు కుడా కాదు.మరి దేనికా మొండి ధైర్యం గుణశేఖర్ కి అంటే … సినిమా అంటే పిచ్చి కాబట్టి.

ఈ నెల 9న విడుదల అవుతున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా అందరిని ఆకట్టుకొని గుణశేఖర్ శ్రమకు గుర్తింపు మాత్రమే కాకుండా, లాభాలు కుడా తెచ్చిపెడుతుందని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube