బ్ర‌హ్మోత్స‌వం క‌థేమిటి?

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.

 What Is Brahmotsavam Story…?-TeluguStop.com

పి.సినిమా పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘బ్రహ్మోత్సవం’.ఈ చిత్రం షూటింగ్‌ సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైంది.ఇప్పుడు మూడో షెడ్యూల్ కూడా ఫిల్మ్ సిటీలోనే జ‌రుగుతోంది.ఈ నెల 9 వ‌ర‌కు ఫిల్మ్ సిటీ షెడ్యూల్ ఉంటుంది.ముగ్గురు మ‌ర‌ద‌ళ్ళు, చ‌క్క‌టి కుటుంబం, వారి మ‌ధ్య వ‌చ్చిన చిన్న చిన్న అల‌క‌లు… ఈ నేప‌థ్యంలో బ్ర‌హ్మోత్స‌వం తెర‌కెక్కుతోంద‌ట‌.

ఒక్క మాట‌లో చెప్పాలంటే మురారి త‌ర‌హా సినిమా ఇది అని వినికిడి.మ‌రో అద్భుత‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్లో న‌టిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని మ‌హేష్ కూడా ఆ మ‌ధ్య అన్నారు.513 మంది తో తోట త‌ర‌ణి వేసిన సెట్‌లో తెర‌కెక్కించిన సంగీత్ సాంగ్ ఈ సినిమాకు అత్యంత కీల‌క‌మ‌ట‌.అందుకే ఆ పాట‌తోనే సినిమాను మొద‌లుపెట్టారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube