ఒంట్లో ప్రొటీన్ తక్కువైతే ఎన్ని ప్రమాదాలో!

ప్రొటీన్ ఎందుకు అవసరమో, ప్రొటీన్ ఎక్కువగా లభించే ఆహారం ఏదో మనం ఇప్పటికే చదవుకోని ఉంటాం.రక్తం, ఎముకలు, హార్మోన్స్ .

 Lack Of Proteins, Hormones, Sleep Problems, Digestion,immunity, Health Tips In T-TeluguStop.com

ఇలా చెప్పుకుంటూ పోతే శరీరంలోని చాలా విభాగాలు సరిగా పనిచేయాలంటే ప్రొటీన్స్ అవసరం.మరి ప్రోటీన్‌లు శరీరానికి తక్కువగా అందితే ఏమవుతుంది?

* ప్రోటీన్‌లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెడతాయి.ప్రోటీన్‌ల శాతం తక్కువ అవుతున్నా కొద్ది, షుగర్ లెవెల్స్ శాతం పెరిగిపోతూ ఉంటుంది.

* కండరాలు బలాన్ని కొల్పోతాయి.

మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, బాడి బిల్డింగ్ చేసేవారు కండరాలు గట్టిపడాలనే ప్రోటీన్లు ఎక్కువగా తీసుకుంటారు.అందుకే ప్రోటీన్‌లు అందకపోతే కండరాలు వీక్ గా ఉంటాయి.

* ప్రోటీన్‌లు తక్కువగా అందితే, మతిమరుపు రావడం, విషయాల్ని సరిగా గ్రహించకపోవడం జరుగుతుందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి.

* ప్రోటీన్‌లు తక్కువగా అందుతున్నకొద్దీ, రోగనిరోధకశక్తి తగ్గతూ ఉంటుంది.

అలాంటప్పుడు చిన్న చిన్న ఇంఫెక్షన్స్ ని కూడా తట్టుకోలేదు శరీరం.ఇక ఏదైనా పెద్ద సమస్య వస్తే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం.

* కొంచెం విచిత్రంగా అనిపించినా, ప్రోటీన్‌లు తక్కువైతే ఆకలి బాగా వేస్తుంది, అలాగే ఊరికే అలసిపోతారు.మొత్తానికి జీవక్రియ దెబ్బతింటుంది.

* శరీరం ఉబ్బిపోతుంది.అది ముఖం కావచ్చు, చేతులు కావచ్చు.ప్రొటీన్ తక్కువైతే శరీరంలో నీరు అలానే ఉండిపోతుంది.

* ప్రోటీన్‌లు తక్కువైతే హార్మోనుల సమతుల్యత దెబ్బతింటుంది.

ముఖ్యంగా నిద్రను మోసుకొచ్చే హార్మోన్స్ సరిగా సీక్రేట్ కావు.దాంతో నిద్రలేమి సమస్యలు వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube