Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

WWE వీరులు రోజు ఏం తింటారో, ఎలా తింటారో తెలుసా ?-What Famous WWE Superstars Eat In Daily Diet ?

WWE చూసే అలవాటు ఉందా ? ఇప్పుడు చూడట్లేదు ఏమో కాని, ఒకప్పుడు అయితే చూసేవారు కదా. జాన్ సీనా, రాక్ .. ఇలాంటి సూపర్ స్టార్స్ కి మీరు ఎదో ఒక దశలో ఫ్యాన్ అయి ఉంటారు. వాళ్ళు అలా కుర్చిలతో, బల్లలతో రక్తాలు కారేలా కొట్టుకోవడం నిజమా కాదా అనే విషయాన్ని కాసేపు పక్క పెడదాం. వాళ్ళంతా ఎంత ఫిట్ గా ఉంటారో కదా. కండలు తిరిగిన దేహం, భారి కాయం .. అయినా సరే, రింగ్ లో చురకుగా కదులుతారు, గాల్లోకి చక్కర్లు కొడుతూ మరి కిక్ కొడుతుంటారు, అలవోకగా రింగ్ పై నుంచి దూకుతుంటారు. గంటలకొద్దీ దెబ్బలాడుకుంటారు. ఇవి కేవలం బలం, బరువుకి సంబంధించిన విషయాలు కావు. ఫిట్ నెస్ కి సంబంధించిన విషయాలు. ఫిట్ గా ఉంటార్ కాబాట్టే, 100 కేజిల నుంచి 250 కేజీల బరువ ఉండే యోధులు రింగ్ లో అంత చురుకుగా ఉంటారు. వాళ్ళు ఎలాగో గంటల తరబడి వ్యాయామం చేస్తారు. కాని తిండి ఏం తింటారు ? అంత బలం, ఫిట్ నెస్ ఊరికే రాదుగా ? కొందరు ఫేమస్ WWE రెజ్లర్స్ తమ డైట్ లో ఏం తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం.

* Brock Lesnar :

ఇతడిని రెజ్లింగ్ ప్రపంచంలో జంతువు అని అంటారు. అతనికున్న బలం అలాంటిది మరి. బిరుదుకి తగ్గట్లే ఒకప్పుడు సొంతంగా జంతువులని వేటాడి తినేవాడట. కాని ఒక విచిత్రమైన జబ్బు వచ్చాక శాకాహారం ఎక్కువ తినమని చెప్పారట డాక్టర్లు. అప్పటినుంచి ఆకుకూరలు ఎక్కువ తింటున్నాడు. అలాగని మాసం పూర్తిగా మానేయ్యలేదు.

* Big Show :

రెండు వందల కేజీలకు పైగా బరవు, 7 ఫీట్లకు పైగా ఎత్తు ఉండే బిగ్ షో, తన భారి కాయానికి తగ్గట్టే రోజుకి అయిదు సార్లు తింటాడు. మనం ఒక గుడ్డుతో ఒక ఆమ్లెట్ వేసుకుంటే, ఇతడు 20 గుడ్లతో ఒక ఆమ్లెట్ వేసుకుంటాడటా. గుడ్లు, పాలు బాగా తీసుకునే బిగ్ షో, మాంసాహారం విపరీతంగా తింటాడటా. మరి తన ఆకారానికి ఆకలి తీరాలి కదా. ఐస్ క్రీమ్స్ టైంపాస్ కి తింటాడటా.

Continue Reading
More Posts
To Top