వామ్మో ... ఒక్క సినిమాకి 300 కోట్ల లాభాలా !

ఈరోజుల్లో సినిమా హిట్ అయిన లాభాలు రావడం కష్టం.పేరుకి హిట్ అయిన, నిర్మాతలకి, పంపిణీదారులకి పెద్దగా ఏం మిగలని సినిమాలెన్నో ఉన్నాయి.

 What … Dangal Earns 300cr+ Profits-TeluguStop.com

సరే, లాభాలు వచ్చిన పది, పాతిక వస్తే గొప్ప.కాని అన్ని సినిమాలు ఆమీర్ ఖాన్ సినిమాలు వేరు, మిగితా హీరోలు, ఆమీర్ ఖాన్ వేరు.

తనతో సినిమా అంటే, నిర్మాత నిశ్చించతగా ఉండవచ్చు.ఎందుకంటే అన్ని ఇండస్ట్రీ హిట్లేగా.

3 ఈడియట్స్, ధూమ్ 3, పీకే, అన్ని వంద, రెండువందల కోట్ల లాభాలు తెచ్చిపెట్టాయి.ఎలాగైతే తన సినిమా సినిమాకి కలెక్షన్లు పెరుగుతున్నాయో, తన సినిమాలకి లాభాలు కూడా పెరిగిపోతున్నాయి.

తాజాగా, మరోసారి దంగల్ తో అవలీలగా మరో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆమీర్, ఈసారి 300 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టాడు.

అసలు మిగితా హీరోల సినిమాలు 300 కోట్ల కలెక్షన్లు రాబడితేనే గొప్ప, అలాంటిది దంగల్ 300 కోట్లకు పైగా లాభాలు సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా 730 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన దంగల్, ఇండియాలో ఇప్పటికే 380 కోట్లకు పైగా నెట్ వసూళ్ళను సాధించింది.ఈ పరుగు ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పలేం.

అన్నట్లు చెప్పడం మరచిపోయాం .దంగల్ కి ఆమీర్ రెమ్యునరేషన్ ఏమీ తీసుకోలేదు.లాభాల్లో 55% వాటా తనది.అంటే 165 కోట్లకు పైగా ఆమీర్ జేబులోకి వెళతాయన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube