షుగర్ పెషెంట్స్ యొక్క బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలంటే

మన ఇంట్లోనో, పక్కింట్లోనో, మన చుట్టాల్లోనో ఎవరో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతుండటం చూస్తుంటాం.నేటి లైఫ్ స్టయిల్ లో చాలా సర్వసాధరణమైన సమస్యగా మారిపోయింది మధుమేహం.

 What A Diabetes Patient’s Breakfast Should Consist ?-TeluguStop.com

ఈ సమస్యతో బాధపడేవారు తమ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాలి.ముఖ్యంగా అల్పాహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అసలు ఒక షుగర్ పేషెంట్ బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలంటే …

* బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు ఖచ్చితంగా కలిగి ఉండాలి.బ్రేక్ ఫాస్ట్ అంటేనే 8-10 గంటలు ఉపవాసం చేసి, ఏదైనా తినటం.

బ్రేక్ ఫాస్ట్ ని పట్టించుకోకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి.

* అరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.

బయటకెళ్ళి క్వాలిటి లేని నూనెతో, పిండితో హోటల్ వారు చేసే వంటకాలు తినటం కాదు, ఇంట్లోనే మంచి అల్పాహారం ప్రపేర్ చేసుకోవాలి.

* షుగర్ కంటెట్ ఎక్కువగా ఉండే పదార్థాలను ముట్టకూడదు.

అలాగే ఫ్యాట్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.

* తాజా పండ్లు (షుగర్ కంటెంట్ తక్కువ ఉన్నవి), కూరగాయలు తీసుకోవాలి.

* ఆపిల్స్, అవకాడో, ఓట్ మీల్ .ఇవి ఉదయాన్నే తీసుకుంటే రోజంతా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టొచ్చు.

* నాణ్యమైన పెరుగు.అంటే ఎలాంటి ఫ్లేవర్స్ కలపని పెరుగుని తీసుకోవాలి.

* ఉదయాన్నే పండ్ల రసాన్ని తాగే బదులు, డైరెక్టుగా పండ్లు తినాలి.జ్యూస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

* ఫైబర్ దొరికే పదార్థాలు, ఫ్యాట్ లేని పాలు, దాల్చిన చెక్క పొడిని చేర్చిన షుగర్ లెస్ టీ లేదా కాఫీని ఉదయాన్నే సేవించవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube